తమిళ స్టార్ హీరో జయం రవి,టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ మూవీ సైరెన్.. ఈ మూవీలో టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా కీలక పాత్రలో నటించింది.. రివేంజ్ డ్రామా థ్రిల్లర్‌గా తెరకెక్కిన సైరన్ మూవీకి ఆంటోనీ భాగ్యరాజ్ కథ, దర్శకత్వం వహించారు.సూజాత విజయ్ కుమార్ మరియు అనూష విజయ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించిన సైరన్ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఎస్‌కే సెల్వ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. రూబెన్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. సైరన్ మూవీలో తమిళ పాపులర్ కమెడియన్ యోగిబాబు, నటుడు సముద్రఖని, కౌశిక్ మెహతా మరియు తులసి తదితరులు కీలక పాత్రలు పోషించారు. 2023లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ కోలీవుడ్ మూవీ తాజాగా తమిళంలో విడుదలైంది.ఫిబ్రవరి 16న తమిళంలో రిలీజైన సైరన్ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది.
అయితే, ఈ సినిమాను తెలుగులో కూడా ఇదే టైటిల్‌తో రిలీజ్ చేయనున్నారు. ‘గంగ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్‌పై మహేశ్వర్ రెడ్డి మూలి ఫిబ్రవరి 23న సైరన్ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు. కొన్ని రోజుల గ్యాప్ తో కీర్తి సురేష్, జయం రవి నటించిన సైరన్ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది, చేయనుంది. ఈ సమయంలో సైరన్ ఓటీటీ డీల్ ఫిక్స్ అయిందని సమాచారం.సైరన్ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మంచి ధర వెచ్చించి కొనుగోలు చేసిందని సమాచారం. థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత నెల లేదా, 45 రోజుల తర్వాత డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో సైరన్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. సాధారణంగా తమిళ మరియు మలయాళ చిత్రాలు ఎక్కువగా హాట్‌స్టార్‌లోనే స్ట్రీమింగ్ అవుతుంటాయి. దీనితో సైరన్ మూవీ కూడా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఇదే కాకుండ సైరన్ శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా ఛానెల్ భారీ మొత్తానికి దక్కించుకుందని సమాచారం