Tamil Nadu: బస్ డ్రైవర్కు గుండె పోటు.. 20 మంది పిల్లల్ని రక్షించి ప్రాణాలు వదిలిన డ్రైవర్
- స్కూల్ బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు గుండెపోటు
- బస్సును పక్కన ఆపి 20 మంది పిల్లలను కాపాడిన డ్రైవర్
- అనంతరం ప్రాణాలు వదిలిని బస్సు డ్రైవర్
- తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఘటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య కాలంలో గుండెపోటు ప్రమాదాలు బాగా పెరిగిపోయాయి. అప్పటి వరకే బాగానే ఉంటూ.. ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా.. గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. గతంలో కంటే చాలా ఎక్కువగా, సడన్ గా వస్తున్న గుండెపోటులపై ప్రతి ఒక్కరిలోనూ భయాందోళన కలుగుతోంది. ఇదిలా ఉంటే.. తమిళనాడులో స్కూల్ బస్సు డ్రైవర్ గుండెపోటుతో చనిపోయి.. మరో 20 విద్యార్థుల ప్రాణాలను కాపాడాడు.
CM Revanth Reddy: సెక్రటేరియట్‌లో ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
Also Read
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో 49 ఏళ్ల స్కూల్ బస్సు డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన సురక్షితంగా ఆపి సుమారు 20 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడాడు. అనంతరం.. కొద్దిసేపటికే అతను కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందాడు. వెంటనే గమనించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా అక్కడికి చేరుకునేలోపే చనిపోయినట్లు ప్రకటించారు. తాను చనిపోయే ముందు డ్రైవర్ చేసిన ఈ పనికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. ఈ సంఘటన జూలై 24 బుధవారం రోజున జరిగింది. వెల్లకోయిల్‌లోని ANV మెట్రిక్ స్కూల్ నుండి విద్యార్థులను వారి ఇళ్ల వద్ద దింపడానికి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఛాతిలో నొప్పి రావడంతో బస్సు డ్రైవర్ అతి కష్టం మీద వాహనాన్ని రోడ్డు పక్కన సురక్షితంగా నిలిపాడు. అయితే.. అతని భార్య కూడా అదే స్కూల్‌లో హెల్పర్‌గా పనిచేస్తుంది. ఈ ఘటన జరిగినప్పుడు ఆమె కూడా అందులోనే ఉంది.
మృత్యువు అంచున ఉన్న చిన్నారుల ప్రాణాలను కాపాడిన డ్రైవర్ వీరోచిత చర్యను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహా పలువురు కొనియాడారు. “తన ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పటికీ, అతను పాఠశాల విద్యార్థుల విలువైన ప్రాణాలను కాపాడాడు. అతని కర్తవ్య భావం, ఆత్మబలిదానాలకు మేము ఆయనకు నమస్కరిస్తున్నాము.” అని స్టాలిన్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా.. మృతుడు సెమలయ్యప్పన్ కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని సీఎం స్టాలిన్ ప్రకటించగా.. మంత్రి ఎంపీ సామినాథన్ మృతుడి కుటుంబానికి చెక్కును అందజేశారు. మరోవైపు.. బస్సు డ్రైవర్‌కు శుక్రవారం ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు నివాళులర్పించారు. పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ కూడా కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులర్పించారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!