హాట్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉంది. సినిమాల తో పాటుగా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బాగా సంపాదిస్తుంది తమన్నా.ఇటీవలే ఈ భామ నటించిన లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయింది. ఈ వెబ్ సిరీస్ లో తమన్నా బోల్డ్ సన్నివేశాలలో నటించింది. ప్రియుడు విజయ్ వర్మ తో కలిసి ఎంతో బోల్డ్ గా నటించింది ఈ భామ. ఈ సిరీస్ తో తమన్నా బాగా పాపులర్ అయింది.ఇక ఈ భామ తెలుగులో చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ఆగష్టు నెల 11 వ తేదీన ఎంతో గ్రాండ్ గా విడుదల అవబోతుంది. అలాగే ఈ భామ తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘జైలర్’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా ఆగస్టు 10 వ తేదీన గ్రాండ్ గా విడుదల కానుంది.. దీంతో భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమాల నుంచి వరుసగా సాంగ్స్ ను విడుదల చేస్తూ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు మేకర్స్.ఇకపోతే తాజాగా రజనీకాంత్, తమన్నా నటించిన ‘జైలర్ ‘సినిమా నుంచి తాజాగా ‘వా నువు కావాలయ్యా’ సాంగ్ ని విడుదల చేశారు.అనిరుద్ సంగీతంలో వచ్చిన ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ను అందించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.ఈ క్రమంలో తమన్న ముంబై ఎయిర్ పోర్టులో కనిపించడంతో ఓ అభిమాని ఏకంగా కావాలయ్యా సాంగ్ కి తనతో కలిసి డాన్స్ వేయాలంటూ కోరినట్లు సమాచారం.. అందుకు తమన్నా కూడా అంగీకరించి అభిమానితో తమన్నా డాన్స్ వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. అంతేకాకుండా తమన్నా ఇలా డాన్స్ చేయడంతో ఈ సినిమాకి కూడా భారీగా నే ప్రమోషన్ జరిగింది అంటూ పలువురు ఈ వీడియో పై కామెంట్స్ చేస్తున్నారు.