సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ సినీమా ఇండస్ట్రీలో కూడా బాగా బిజీగా మారిపోయింది తమన్నా.. ఆమె వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో లో నటిస్తూ బాగా బిజీగా ఉంది.ఈమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో ప్రేమలో ఉన్నాను అంటూ సంచలన వ్యాఖ్యల ను చేసింది.గత కొంతకాలంగా వీరిద్దరూ కూడా కలిసి కనిపించడంతో వీరిద్దరి గురించి ఎన్నో వార్తలు అయితే వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన తమన్నా తనతో రిలేషన్ లో ఉన్నానని చెప్పేసింది. ఈమె నటించిన లస్ట్ స్టోరీ 2వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో చాలా బిజీగా ఉన్న తమన్నా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారని తెలుస్తుంది..
ఈ ఇంటర్వ్యూ లో తమన్నా ఎన్నో విషయాల గురించి మాట్లాడటం జరిగింది..ముఖ్యంగా ప్రేమ,పెళ్లి వంటి వాటి గురించి తమన్నా చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే పెళ్లి విషయంలో ఏదైనా ఒత్తిడికి గురవుతున్నారా అన్న ప్రశ్న ఈమెకు ఎదురవడంతో ఈ ప్రశ్నకు ఈమె తనదైన శైలిలో సమాధానం చెప్పింది.. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన బాధ్యత అని తెలిపింది.. మనకు నచ్చినప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవడం కాదు. ఆ బాధ్యతను మోయడానికి మనం పూర్తిగా సిద్ధంగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలని, అప్పుడే వివాహ బంధంలోకి అడుగు పెట్టాలని తమన్నా తెలిపింది.. పెళ్లి అంటే కేవలం వేడుక మాత్రమే కాదు అదొక పెద్ద బాధ్యత.పెళ్లి తర్వాత కొన్ని సంవత్సరాలు కలిసి ఉండాలి అందుకే ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని తమన్నా తెలిపింది.. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన దశాబ్ద కాలం పాటు చాలా బిజీగా ఉంటానని అనుకున్నాను. అలాగే నేను 30 సంవత్సరాల కు పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలని ప్లాన్ వేసుకున్నాను అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఆలోచనలు అన్నీ పూర్తిగా మారాయి అని నాకు నేను గా సొంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాను అంటూ ఈ సందర్భంగా పెళ్లి గురించి తన అభిప్రాయం తెలిపింది తమన్నా .