సినీ పరిశ్రమలో హీరోయిన్ల కెరీర్ అంటే చాలా తక్కువ కాలం ఉంటుందని, పెళ్లి లేదా వయసు పెరగడంతో ఆఫర్లు తగ్గుతాయని అందరూ అంటుంటారు. కానీ మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం గత 18 ఏళ్లుగా తన ఇమేజ్‌ను చెక్కుచెదరకుండా కాపాడుకుంటూ వస్తోంది. కెరీర్ ఆరంభంలో చాలా పద్ధతిగా, హోమ్లీ పాత్రలకే పరిమితమైన తమన్నా.. ఒకానొక దశలో తన స్ట్రాటజీని పూర్తిగా మార్చేసింది. ముఖ్యంగా ‘100% లవ్’ సినిమాతో గ్లామర్ డోస్ పెంచి, మాస్ ఆడియన్స్‌కు ఫేవరెట్‌గా మారిపోయింది. ఆ సినిమాలో ఆమె చూపించిన గ్లామర్ ఒక్కసారిగా తన కెరీర్ గ్రాఫ్‌ను అమాంతం పైకి తీసుకెళ్లింది.
Also Read : Vrusabha Trailer : గ్రాండ్ విజువల్స్‌తో..వింటేజ్ మోహన్ లాల్ ‘వృషభ’ ట్రైలర్ రలిజ్..
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో.. బద్రీనాథ్, రచ్చ, కెమెరామెన్ గంగతో రాంబాబు వంటి మాస్ చిత్రాల్లో స్టార్ హీరోల పక్కన వరుస అవకాశాలు దక్కించుకుంది. నటిగా తనను తాను నిరూపించుకోవడానికి, కథ డిమాండ్ చేస్తే లిప్‌లాక్ సీన్లు లేదా ఇంటిమేట్ సీక్వెన్స్‌లకు ఏనాడూ అడ్డు చెప్పలేదని, అదే తన విజయ రహస్యమని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది. మొదట్లో కొన్ని కఠినమైన నిబంధనలు పెట్టుకున్నప్పటికీ, గ్లామర్ ఫీల్డ్‌లో పోటీని తట్టుకోవాలంటే కాలానుగుణంగా మారాలని ఆమె గ్రహించిందట. అదే మొండితనం చూపిస్తే ఇప్పుడు తాను ఈ స్థాయిలో ఉండే దాన్ని కాదని ఆమె నిజాయితీగా అంగీకరిస్తోంది.
కేవలం వెండితెరపైనే కాకుండా, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ (OTT) పై కూడా తమన్నా తన సత్తా చాటుతోంది. ‘లస్ట్ స్టోరీస్ 2’ వంటి వెబ్ సిరీస్‌లలో బోల్డ్ పెర్ఫార్మెన్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం లీడ్ హీరోయిన్‌గా మాత్రమే కాకుండా, ‘జైలర్’ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ (కావాలయ్య) ద్వారా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఏ పాత్రనైనా, ఏ సాంగ్‌నైనా తనదైన గ్రేస్‌తో పండించడం వల్లే అటు కుర్రకారులో, ఇటు దర్శకుల్లో ఆమెకు ఎప్పుడు క్రేజ్ తగ్గడం లేదు. అలా.. తనను తాను రీ-ఇన్వెంట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న తమన్నా, కొత్త హీరోయిన్లకు ఒక గైడ్‌లా నిలుస్తోంది.