రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మునిగిపోతున్నా అని కాంగ్రెస్ ను మొత్తంగా ముంచే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నారని మంత్రి తలసాని హెద్దేవ చేశారు. రైతుతో గోకున్నవాడు ఏనాడు బాగుపడడని, వెంటనే రేవంత్ రెడ్డి ముక్కుపిండి కాంగ్రెస్ అధిష్టానం రైతులకు క్షమాపణ చెప్పించాలన్నారు. సీతక్కను ముఖ్యమంత్రి చేయడం, రైతులకు మూడు గంటల విద్యుత్ చాలని చెప్పడం కాంగ్రెస్ పార్టీని ముంచడమేనని మంత్రి తలసాని వ్యాఖ్యానించారు.
Also Read : BAN vs AFG: ఆఫ్ఘనిస్తాన్ చేతిలో వైట్ వాష్ అయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్న బంగ్లాదేశ్
ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ వ్యాఖ్యలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దుర్మార్గం, అన్యాయమన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే.. రైతులకు 3 గంటల ఉచిత విద్యుతే గతి. రైతులు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని, కాంగ్రెస్ పార్టీకి చెంప చెళ్లమనిపించే విధంగా రేపు నిరసనలు చేపట్టాలన్నారు. ఉచితం అనుచితం అంటే.. పెన్షన్లు, రైతు బంధు, రైతు బీమా తొలగిస్తామని చెప్పకనే చెప్పారని, కేసీఆర్ రైతు రక్షకుడు ఐతే కాంగ్రెస్, బీజేపీ లు రైతు భక్షకులని ఆయన విమర్శించారు. బీజేపీ ఆదాని కోసం, కాంగ్రెస్ పైరవి కారుల కోసం పని చేస్తాయని, రైతులు మేల్కొని కాంగ్రెస్ వ్యతిరేక నిరసనలో పెద్ద ఎత్తున పాల్గొనాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
Also Read : Thief Devotee: హనుమాన్ చాలీసా చదివి.. హుండీ పగులగొట్టి డబ్బులతో దొంగ పరార్