NTV Telugu Site icon

Bhatti Vikramarka : ఫైనల్‌గా బీసీ జనాభా 56 శాతం.. సర్వే పకడ్బందీగా జరిగింది

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka : ప్రజాభవన్‌లో బీసీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా బీసీ కులగణన, 42శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ జరుగనుంది. అయితే.. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సర్వే పకడ్బందీగా జరిగిందన్నారు. ఫైనల్ గా బీసీ జనాభా 56 శాతమని, కేటీఆర్ లాంటి వాళ్ళు సర్వేలో పాల్గొనలేదని ఆయన పేర్కొన్నారు. నేను పాల్గొంట అని సభలో.. బయట అడిగారని, కాబట్టి మళ్ళీ వారం గడువు ఇచ్చామని ఆయన తెలిపారు. ఛాలెంజ్ గా తెలంగాణ ప్రభుత్వం సర్వే చేసిందని, ఎవరికి సందేహం అవసరం లేదన్నారు భట్టి విక్రమార్క. అందరికీ సమాధానం చెప్పండని, ఇంత బాగా సర్వే చేస్తే కూడా రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మనం ఇంత చేసినా కొందరు రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ సమాజం రాజకీయ ప్రేరేపితం కాబట్టి అంటుంటారని, బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాగోలేదు అని చెప్పడంతో.. బీసీలకు లబ్ధి చేయొద్దు అని ఆలోచనతో.. అందుకే బాగోలేదు అంటున్నారన్నారు.

Amaravati: అమరావతి నిర్మాణ పనులకు శ్రీకారం.. ఎప్పటినుంచంటే..!

ఇది మనకు టార్చ్ లాంటిదని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. దాన్ని అందుకుని ముందుకు పోవాలని, సీఎం రేవంత్ నీ అభినందిస్తున్నామన్నారు. సామాజిక సర్వే చేస్తే వచ్చే ఇబ్బందులు ఉంటాయని, కానీ రేవంత్ రాహుల్ గాంధీ అజెండానే నా అజెండా అని చెప్పారన్నారు. చాలా స్పష్టంగా ఉన్నారు సీఎం అని, సామాజిక న్యాయం చేయడానికి అవకాశం వచ్చింది అని చెప్పారు సీఎం అని భట్టి విక్రమార్క తెలిపారు. బీఆర్‌ఎస్‌.. బీజేపీ కుట్ర చేస్తున్నాయని, బీసీలకు ఆ ఫలాలు అందొద్దు అని వారి ఆలోచన అని ఆయన విమర్శించారు. బీసీ లు చైతన్యవంతులుగా ఉండండని, బీఆర్‌ఎస్‌ కి నష్టం జరుగుతుందని భయంతో ఉంది.. అందుకే తప్పులు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన మండిపడ్డారు. బీజేపీ.. దేశ వ్యాప్తంగా సర్వే చేయాల్సి వస్తుంది అని బీజేపీ అడ్డుకుంటుందని, సర్వే అంతా నేనే దగ్గర ఉండి చూశానని, తప్పులు ఎక్కడ జరగలేదని ఆయన పేర్కొన్నారు.

Vishnuvardhan Reddy: కృష్ణా జలాలపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఏపీకి క్షమాపణ చెప్పాలి