NTV Telugu Site icon

Perni Nani : మాజీ మంత్రి పేర్ని నాని, పేర్ని కిట్టులకు పోలీసుల నోటీసులు

Perni Nani Wife

Perni Nani Wife

Perni Nani : ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం అక్రమాల కేసు దర్యాప్తులో భాగంగా వైఎస్సార్‌సీపీ నేత , మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పేర్ని నాని‌కు చెందిన గోడౌన్‌లో రేషన్ బియ్యం అక్రమాలు నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించిన తర్వాత ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు.

పోలీసులు, తమ దర్యాప్తులో సహకరించాలని కోరుతూ, పేర్ని నాని ఇంటికి వెళ్లారు. కానీ ఇంట్లో ఎవ్వరూ లేకపోవటంతో, ఇంటి తలుపులకు నోటీసులు అంటించారు. ఈ కేసులో నిందితులుగా పేర్ని నాని భార్య జయసుధ , ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజ ఉన్నారు.

పోలీసులు జయసుధ , మానస తేజను త్వరగా హాజరయ్యేందుకు నోటీసులు జారీ చేశారు. వారు మధ్యాహ్నం 2 గంటలలోపు స్టేషన్‌కు వచ్చి వాస్తవాల గురించి వివరించాలని, అందుబాటులో ఉన్న రికార్డులు ఇవ్వాలని సూచించారు.

Nizamabad: బంగారు నాణేల పేరుతో రూ.7లక్షలు కాజేసిన కేటుగాడు..

ఈ కేసు నేపథ్యంలో, కృష్ణాజిల్లా బందరులో కోటి రూపాయల రేషన్ బియ్యం మాయమైందని అధికారులు గుర్తించారు. ఈ కేసులో పేర్ని నాని చిక్కుకున్నారు. వారి సతీమణి జయసుధ , ఆమె పీఏ మానస తేజ కూడా నిందితులుగా ఉన్నారు.

ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో, నాని సతీమణి జయసుధ పేరు మీద గోడౌన్ నిర్మించి, సివిల్ సప్లైస్‌కు అద్దెకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో, పేదలకు కేటాయించాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టింది. ఈ వ్యవహారం మీద పేర్ని నాని పై అధికార దుర్వినియోగం ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోంది, , పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Game Changer : కింగ్ మాదిరి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్

Show comments