డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నెలలో 15 రోజులు, రెండు పూటలా రేషన్ సరకుల పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు. ఆ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ సరుకుల చౌక ధరల దుకాణాలు గత ప్రభుత్వంలో మూసేసి, ఇంటింటికి అందిస్తాం అని రూ.1600 కోట్లతో వాహనాలు కొనుగోలు చేసిన విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పాలన పూర్తిగా భ్రష్టుపట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు దిక్కులేకుండా పోయిందని అన్నారు. ముఖ్యమంత్రి రబ్బర్ స్టాంప్ లా మారిపోయారని, రాష్ట్ర పాలనను జన్ పథ్, గాంధీభవన్ ద్వారా నడిపిస్తున్నారని మండిపడ్డారు.
నేడు ఒక కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు పలు ప్రశ్నలు సంధించింది. దేశంలోని పలు రాష్ట్రాలు రేషన్ పంపిణీ వ్యవస్థల ద్వారా నిరుపేదలకు సబ్సిడీతో కూడిన నిత్యావసర సరకులను సరఫరా చేస్తున్నామని చెప్పుకుంటున్నట్లు గుర్తు చేసింది. అయితే ఈ రేషన్ బీపీఎల్(దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు) లబ్ధిదారుల కుటుంబాలకు చేరడం లేదని పేర్కొంది. రాష్ట్రాలు రేషన్ కార్డులను ప్రదర్శన కోసం ఉపయోగిస్తున్నారా?
Perni Nani : ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం అక్రమాల కేసు దర్యాప్తులో భాగంగా వైఎస్సార్‌సీపీ నేత , మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పేర్ని నానికు చెందిన గోడౌన్‌లో రేషన్ బియ్యం అక్రమాలు నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించిన తర్వాత ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. పోలీసులు, తమ దర్యాప్తులో సహకరించాలని కోరుతూ, పేర్ని నాని ఇంటికి వెళ్లారు. కానీ ఇంట్లో ఎవ్వరూ లేకపోవటంతో, ఇంటి…
Ration Card: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్’ పథకం ఇప్పుడు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఇప్పుడు దేశం మొత్తం ఈ పథకం పరిధిలోకి వచ్చిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది.