Harish Rao : ఒకటో తేదీ నాడే ఉద్యోగులకు జీతాలు అంటూ గప్పాలు కొట్టిన సీఎం రేవంత్.. ఈనెల 14వ తేదీ వచ్చినా 39,568 మంది అంగన్వాడీ టీచర్లలు, ఆయాలు జీతాలు రాక ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రెస్ నోట్ విడుదల చేశారు. 10 నెలలుగా అంగన్వాడి కేంద్రాలకు అద్దెలు కూడా చెల్లించని దుస్థితి ఉంది ఆయన పేర్కొన్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో మీరు సాధించిన ఘనత ఇది అని ఆయన విమర్శించారు.
Kejriwal: మహిళలపై నేరాల్లో తొలి స్థానంలో ఢిల్లీ.. అమిత్ షాకు కేజ్రీవాల్ లేఖ..!
విశ్రాంత ఉపాధ్యాయులను, ఉద్యోగులను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నావని, హైకోర్టు ఉత్తర్వులు ఉంటే తప్ప హక్కుగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా వారిని, వారి కుటుంబాలను క్షోభకు గురి చేస్తున్నావని ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. అంగన్వాడి టీచర్లు, ఆయాలు, విశ్రాంత ఉపాధ్యాయ, ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇలా లక్షల మంది సకాలంలో జీతాలు రాక అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నట్లు చేస్తున్న డబ్బా ప్రచారాన్ని ఇకనైనా ఆపండన్నారు హరీష్ రావు. ఉద్యోగులందరికీ సకాలంలో జీతాలు చెల్లించి మాట నిలుపుకోండన్నారు.
CM Revanth Reddy: కామన్ డైట్ ప్లాన్.. చిలుకూరులో ప్రారంభించిన సీఎం రేవంత్