Rohit Sharma: 2027 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఆడతాడు!
- డబ్ల్యూటీసీ అనంతరం రోహిత్ రిటైర్మెంట్
- ప్రపంచకప్‌లో ఆడతాడంటున్న దినేశ్
- ప్రపంచకప్‌లో ఆడితే చరిత్రే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma To Play World Cup 2027: టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. హిట్‌మ్యాన్ ప్రస్తుతం వన్డే, టెస్టులు ఆడుతున్నాడు. 2023-25 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో టీమిండియా ఫైనల్ చేరే అవకాశముంది. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత వన్డేలు, టెస్టులకు రోహిత్ వీడ్కోలు పలుకుతాడని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే హిట్‌మ్యాన్ చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్ స్పందించారు. 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ ఆడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
దైనక్ జాగరణ్ ఇంటరాక్షన్‌లో దినేశ్ లాడ్ మాట్లాడుతూ… ‘ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని నేను చెప్పడం లేదు. వయసు మీద పడుతున్నందున టెస్టు క్రికెట్‌కు అతడు వీడ్కోలు పలుకుతాడని నాకు అనిపిస్తోంది. వన్డే క్రికెట్‌కు ఫిట్‌గా ఉండాలనే కోరిక కూడా దీనికి కారణం కావచ్చు. 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ ఆడతాడని నేను 100 శాతం నమ్ముతున్నా. హిట్‌మ్యాన్ క్రికెట్ అద్భుతంగా ఆడుతున్నాడు. కొన్ని ఇన్నింగ్స్ నమ్మశక్యంగా ఉండవు’ అని అన్నారు.
Also Read
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
- AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఆడతాడా? అనేది పెద్ద ప్రశ్న. అప్పటికి హిట్‌మ్యాన్ వయసు 40 అవుతుంది. ఒకవేళ రోహిత్ మెగా ఈవెంట్లో ఆడితే.. వన్డే గేమ్ ఆడిన అతి పెద్ద వయసు భారతీయ ఆటగాడిగా రికార్డుల్లో నిలుస్తాడు. వన్డే ప్రపంచకప్ గెలవడమే తన కోరిక అని రోహిత్ చాలాసార్లు చెప్పిన విషయం తెలిసిందే. 2015, 2019, 2023 వన్డే ప్రపంచకప్‌లో హిట్‌మ్యాన్ ఆడాడు.
తాజావార్తలు
-
TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
-
Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
-
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!