టోక్యో మెట్రోపాలిటన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ సర్వైలెన్స్ సెంటర్ నుంచి వచ్చిన డేటా ప్రకారం రాజధానిలో సుమారు 2,460 సిఫిలిస్ వైరస్ కేసులు నమోదయ్యాయి. కేసులు వేగంగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. వార్తా సంస్థ జిన్హువా ప్రకారం.. గతేడాది 3,701 కేసులు నమోదయ్యాయి. సిఫిలిస్ రోగులలో 70 శాతం మంది పురుషులు ఉన్నారు. ఈ వైరస్ ముఖ్యంగా 20 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల పురుషులు, 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల స్త్రీలను ప్రభావితం చేస్తుంది. పిల్లలు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు.
READ MORE: Frog leg in samosa: సమోసాలో “కప్ప కాలు”.. వీడియో వైరల్..
ఉచిత పరీక్ష, సంప్రదింపు గదులు..
చాలా మంది సోకిన వ్యక్తులు తాము సురక్షితంగా ఉన్నారని పొరపాటుగా నమ్ముతారు. ఎందుకంటే వారికి ఇన్ఫెక్షన్ గురించి చాలా సంవత్సరాలు తెలియదు. సిఫిలిస్ తరచుగా నిర్లక్ష్యం చేయబడిన వ్యాధి. టోక్యో సిఫిలిస్ కేసుల రికార్డు స్థాయి పెరుగుదలను అరికట్టడానికి షింజుకు , టామా వంటి ప్రాంతాల్లో ఉచిత పరీక్ష, కన్సల్టేషన్ గదులను ఏర్పాటు చేసింది. పబ్లిక్ హెల్త్ సెంటర్‌లలో కూడా పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. షింజుకు కేంద్రం 24 గంటల ఆన్‌లైన్ బుకింగ్, వారాంతపు పరీక్షలను అందిస్తోంది. టోక్యో మెట్రోపాలిటన్ ప్రభుత్వం నివాసితులకు ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కోరింది.
READ MORE:CM Revanth: సీతారాం ఏచూరి మృతిపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి..
సిఫిలిస్ వైరస్ ఎలా వ్యాపిస్తుంది?
ప్రధానంగా లైంగిక సంపర్కం ద్వారా వ్యాపించే సిఫిలిస్.. దద్దుర్లు, అసాధారణతలను కలిగిస్తుంది. ఈ వ్యాధి సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా.. కొన్ని సంవత్సరాలలో కంటి వాపు, వినికిడి లోపం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ వైరస్ ప్రారంభ దశలో సరిగ్గా చికిత్స చేయబడితే.. దాని నివారణ సాధ్యమే, కానీ సిఫిలిస్ చికిత్స చేయకపోతే.. మెదడు, గుండెలో తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి.