కర్ణాటక అసెంబ్లీ నుండి 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. సభలో అసభ్యకరంగా, అమర్యాదకరంగా ప్రవర్తించినందుకు వారిని డిప్యూటీ స్పీకర్ సస్పెండ్ చేశారు. వారిని మార్షల్స్ సహాయంతో బయటకు పంపించారు. దీంతోవారు అసెంబ్లీ ఆవరణలోనే ఆందోళనకు దిగారు. సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యేలలో డాక్టర్ సీఎన్ ఆశ్వత్ నారాయణ్, వి. సునీల్ కుమార్, ఆర్. ఆశోక్, అరగ జ్ఞానేంద్ర, వేదవ్యాస్ కామత్, యశ్ పాల్ సువర్ణ, అరవింద్ బెల్లాడ్, దేవరాజ్ మునిరాజ్, ఉమానాథ్ కొట్యాన్, భరత్ శెట్టిలు ఉన్నారు.
Bro Movie: బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ రోజేనా?
రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను దుర్వినియోగం చేయడాన్ని నిరసిస్తూ బీజేపీకి చెందిన కొందరు సభ్యులు బిల్లులు, అజెండా కాపీలను చించి స్పీకర్ పైకి విసిరేశారు. అదే సమయంలో మధ్యాహ్న భోజన విరామం లేకుండా ప్రొసీడింగ్స్ నిర్వహించడంపై కూడా సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళ దృశ్యాలు కనిపించాయి. బెంగళూరులో నిన్న ముగిసిన రెండు రోజుల ప్రతిపక్ష పార్టీల ఐక్యతా సమావేశానికి సంబంధించి ఐఎఎస్ అధికారుల బృందాన్ని నియమించారు. దీనిని బీజేపీ తప్పుబట్టింది. సభలో గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో లా అండ్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్‌కె పాటిల్ పదిమంది బీజేపీ సభ్యులను సభ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన చేశారు.
Man Killed Using Cobra: ప్రియురాలి స్కెచ్.. ఇంటికి పిలిచి.. పాముతో కాటు వేయించి..!
ఇదిలా ఉంటే బీజేపీ ఎమ్మెల్యేలు డిప్యూటీ స్పీకర్ పై కాగితాలు విసరడంతో సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. డిప్యూటీ స్పీకర్ ను రక్షించేందుకు మార్షల్స్ ఆయన చుట్టూ రక్షణ వలయంగా నిలిచారు. పోడియం ముందు రచ్చ చేశారు. దీంతో 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుండి సస్పెండ్ చేశారు. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల ప్రవర్తనను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఖండించారు. మరోవైపు ఉదయం బీజేపీ, జనతాదళ్ (ఎస్) సభ్యులు వెల్ లో నిరసనలకు దిగారు. అయితే అదే సమయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు బిల్లులు సభలో ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందాయి.