ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిరాశపరిచాడు. స్పిన్నర్ వానిందు హసరంగ బౌలింగ్‌లో సూర్య ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 13 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో 12 రన్స్ మాత్రమే చేశాడు. ఆసియా కప్ 2025లో సూరీడు ఒక్క మ్యాచ్ మినహా.. మిగతా మ్యాచ్‌లలో విఫలమయ్యాడు. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌కు ఆడి 71 రన్స్ మాత్రమే చేశాడు. టోర్నీలో 7* (2), 47* (37), 0 (3), 5 (11), 12 (13) రన్స్ చేశాడు.
Also Read: Vijayawada Temple: దుర్గ గుడి ఆలయ బోర్డు సభ్యులుగా 16 మంది నియామకం.. లిస్ట్ ఇదే!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ 2025లో రెచ్చిపోయాడు. ముంబై ఇండియన్స్ తరఫున 16 మ్యాచ్‌లు ఆడి 717 రన్స్ బాదాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ 2025లో సూరీడి సగటు 65.18 కాగా.. స్ట్రైక్ రేట్ 167.91గా ఉంది. అదే ఆసియా కప్ 2025లో భారత్ తరఫున ఆడి నిరాశపర్చుతున్నాడు. గత 10 మ్యాచ్‌లలో టీమిండియా తరఫున ఆడి 99 రన్స్ చేశాడు. ఒక్క సెంచరీ కూడా చేయలేదు. సగటు 12.37గా.. స్ట్రైక్ రేట్ 110గా ఉంది. 2025 కి ముందు ఏ క్యాలెండర్ ఇయర్‌లో సూర్య 150 కంటే తక్కువ స్ట్రైక్ రేట్‌ను కలిగి లేడు. ఈ ఏడాది భారత్ తరఫున సూర్య గణాంకాలు చూస్తే షాకే.