Surya Kumar Yadav – Rohith Sharma: భారత క్రికెట్ జట్టు జూలై 27 నుంచి శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్, ఆపై వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ రెండు సిరీస్ లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా జట్లను ప్రకటించింది. టీ20 సిరీస్ కు కొత్తగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. గౌతమ్ గంభీర్ పదవీకాలం భారత శ్రీలంక పర్యటన నుండి మొదలు కానుంది. భారత జట్టు శ్రీలంక పర్యటన షెడ్యూల్‌ను ఒకసారి చూద్దాం. జూలై 27న తొలి టీ20 , తర్వాత రెండో టీ20 జూలై 28న జరగనుంది. దీని తర్వాత చివరి టీ20 మ్యాచ్ జూలై 30న జరగనుంది. టీ20 సిరీస్ మొత్తం పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. అదే విధంగా ఆగస్టు 2, 4, 7 తేదీల్లో వన్డే సిరీస్ మ్యాచ్ లు జరగాల్సి ఉంది. ఈ మూడు వన్డే మ్యాచ్ లు కొలంబోలోని ఆర్. ప్రేమదాస అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి.
World Record: 6రోజుల్లోనే ప్రపంచ 7వింతల సందర్శన.. గిన్నీస్ రికార్డు..
ఇక బీసీసీఐ టి20 సిరీస్ కు, వన్డే సీరిస్ కు ప్రత్యేక టీమ్స్ ను అనౌన్స్ చేసింది. ఇక వాటి వివరాలు చూస్తే..
వన్డే జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, ర్యాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్ మరియు హర్షిత్ రాణా.
Tamil Nadu: ఉదయనిధి స్టాలిన్‌కు ప్రమోషన్.. తండ్రి కేబినెట్‌లో కీలక పదవి!?
టి20 జట్టు : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రింకు సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్ మరియు మహ్మద్ సిరాజ్.
Chandipura Virus: ‘చండీపురా వైరస్’ ఏమిటి.? లక్షణాలు, నివారణ, చికిత్స వివరాలు..
ఈ పర్యటనతో భారత కోచ్ గా గంభీర్ పదవీకాలం ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచకప్ 2024 వరకు ఈ పాత్రలో ఉన్న రాహుల్ ద్రవిడ్ స్థానంలో అతడు బరిలోకి దిగడం గమనార్హం . గంభీర్ తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో కోచ్‌గా కనిపించబోతున్నాడు. ఇటీవల భారత జట్టు జింబాబ్వేలో పర్యటించగా అక్కడి జట్టుతో పాటు కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్ ఉన్నాడు.