జగిత్యాల పట్టణంలోని 22 వార్డ్ అరవింద్ నగర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే లిక్కర్ రాణి బతుకమ్మ మీద గౌరమ్మకు బదులు విస్కీ బాటిల్ పెట్టి బతుకమ్మ ఆడుతాదని కవిత ఉద్దేశించి వ్యంగంగా మాట్లాడారు. ఎంపీగా కవితకు ముత్యంపేట, భోధన్ చక్కెర ఫ్యాక్తరీలు మూసివేయించిన ఘనత దక్కింది అని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెదల కోసం జగిత్యాలలో సూపర్ స్పెషలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకు వస్తాను అని జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Viral Video : దేవుడా.. ఏందీ సామి ఈ అమ్మాయిలు.. నడి రోడ్డు పైనే ఆ పని..వీడియో చూస్తే షాకే..
జగిత్యాల మున్సిపాలటీల్లో అమలు చేస్తున్న మాదిరిగానే తెలంగాణాలో చిరు వ్యాపారులకు తై బజార్ పన్ను రద్దు చేస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శకుడు.. దేశ వ్యాప్తంగా హిందూ, ముస్లిం, క్రైస్తవ అన్ని మతాలను ఏకం చేయడం కోసం భారత్ జోడో యాత్ర చేపట్టిన మహానేత రాహుల్ అంటూ ఆయన కోనియాడరు. రాహుల్ గాంధీని విమర్శించే హక్కు ఎమ్మెల్సీ కవితకు లేదు.. కవిత ఎంపీగా ఉండి జగిత్యాలకు ఏం చేశావని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. జగిత్యాలలో నేను చేసిన అభివృద్ధిని చూసి మంత్రి కేటీఆర్ నన్ను అనుసరించి సిరిసిల్లలో అభివృద్ధి చేస్తున్నారు అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. జగిత్యాలలో జీవన్ రెడ్డి ఏం చేశారాని బీఆర్ఎస్ నాయకులు అడుగుతున్నారు.. కదా ఇక్కడ జరిగిన అభివృద్ధి సిద్ధిపేట, సిరిసిల్లలో జరిగిందా అని జీవన్ రెడ్డి సవాల్ విసిరారు.