Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్‌మైండ్ అరెస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Crime: 11వ తరగతిలోనే చదువు స్వస్తి చెప్పిన ఒక 18 ఏళ్ల కుర్రాడు.. ఏకంగా రూ. 64 కోట్లకు పైగా డిజిటల్ దోపిడీకి స్కెచ్ వేసి దేశవ్యాప్తంగా సైబర్ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), టెలిగ్రామ్ వేదికలుగా నకిలీ బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలకు సంబంధించిన మొబైల్ యాప్‌లను (Malicious APKs) తయారు చేస్తూ సైబర్ నేరగాళ్ల ముఠాలకు విక్రయిస్తున్న రోహిత్ వీరేంద్రసింగ్ శాక్య అనే మాస్టర్‌మైండ్‌ను గుజరాత్‌లోని సూరత్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని ఓ హోటల్లో అరెస్ట్ చేశారు. చదువు మధ్యలోనే ఆపేసినా, రోహిత్ తన 16 ఏళ్ల వయసులోనే కోడింగ్‌లో నిపుణుడిగా మారి, ఎస్బీఐ, పీఎన్బీ, యాక్సిస్, ఐసీఐసీఐ, అమరికన్ ఎక్స్‌ప్రెస్, పీఎం కిసాన్, ఆర్టీఓ చలాన్ పోర్టళ్లు, బిగ్‌బాస్కెట్, ఆధార్ వంటి సేవలను పోలిన నకిలీ యాప్‌లను తయారు చేయడం మొదలుపెట్టాడు.
ఈ సైబర్ దందా వెనుక ఒక పక్కా వ్యాపార వ్యూహం ఉంది. జార్ఖండ్‌లోని జామ్తారా, హర్యానా, రాజస్థాన్‌లకు చెందిన సైబర్ ముఠాలకు ఈ నకిలీ యాప్‌లను నెలకు రూ. 15,000 సబ్స్క్రిప్షన్ పద్ధతిలో క్రమం తప్పకుండా అప్డేట్లు ఇస్తూ సరఫరా చేసేవాడు. ఇందులో బాధితులు నమ్మి ఇన్స్టాల్ చేసుకునే “విక్టిమ్ యాప్”, వారి ఫోన్లలోని ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలను నేరుగా చూసి నియంత్రించే “అడ్మిన్ యాప్” అనే రెండు వర్షన్లను రూపొందించాడు. ఈ ఏడాది మే నెలలో సూరత్‌కు చెందిన ఓ వ్యక్తికి వాట్సాప్‌లో ‘PNB One.apk’ అనే నకిలీ లింక్ రాగా, దాన్ని నిజమైనదిగా నమ్మి ఇన్స్టాల్ చేసుకుని రూ. 5 లక్షలు పోగొట్టుకోవడంతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
Also Read
- CM Vijay: సీఎం విజయ్‌కు హైకోర్టు షాక్.. మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు
- Dharmendra Pradhan: నీట్‌పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్‌కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
బాధితుడు సైబర్ హెల్ప్‌లైన్ (1930)కి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణ చేపట్టగా సంచలన విషయాలు బయటపడ్డాయి. రోహిత్ మొత్తం 121 హానికరమైన యాప్‌లను తయారు చేయగా, అవి దేశవ్యాప్తంగా 21,672 ఫోన్లలో ఇన్స్టాల్ అయ్యాయని, వాటిలో 2,928 ఫోన్లు పూర్తిగా నేరగాళ్ల నియంత్రణలోకి వెళ్లాయని తేలింది. వీటి ద్వారా ఏకంగా 54,094 అక్రమ లావాదేవీలు జరిపి రూ. 64.38 కోట్లు కాజేసినట్లు గుర్తించారు. ఇందులో ఆర్టీఓ చలాన్ నకిలీ యాప్‌ల ద్వారానే అత్యధిక నేరాలు జరిగాయి. నిందితుడి నుంచి ల్యాప్‌టాప్, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న మిగిలిన సైబర్ ముఠాల గుట్టు విప్పేందుకు విచారణను వేగవంతం చేశారు.
తాజావార్తలు
-
Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్‌మైండ్ అరెస్ట్!
-
OG Telivision Premiere : బుల్లితెర వీక్షకులను అలరించేందుకు వస్తున్న’OG’
-
Talliki Vandanam: ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త.. 41 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ..
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
Kelly Hottle: సినీ పరిశ్రమలో విషాదం.. గాడ్జిల్లా vs కాంగ్ ఫేమ్ నటి 18 ఏళ్లకే మృతి..
ట్రెండింగ్
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి