Toxic: యశ్ ‘టాక్సిక్’లో ఈ 9 ఏళ్ల బుడ్డోడు ఎవరో తెలుసా? రాకీ భాయ్ ఇచ్చిన గిఫ్ట్‌ల వెనుక అసలు కథ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toxic: ‘టాక్సిక్’ సినిమా థియేటర్లలోకి రాకముందు ఎంత హైప్ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యశ్, నయనతార, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, తారా సుతారియా లాంటి భారీ తారాగణం సినిమాపై అంచనాలు పెంచేసింది. అయితే రిలీజ్ తర్వాత ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ కరువైంది. నెగిటివ్ టాక్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే ‘టాక్సిక్’ లో కొన్ని సన్నివేశాల్లో మాత్రమే కనిపించిన ఓ తొమ్మిదేళ్ల బాలుడు మాత్రం చాలామంది దృష్టిని ఆకర్షించాడు. అతని పేరు మిఖాయిల్ రావు ఖాన్. ‘టాక్సిక్’తోనే కెమెరా ముందుకు వచ్చిన ఈ చిన్నారి, మొదటి సినిమాతోనే ఏకంగా యశ్‌తో కలిసి నటించే ఛాన్స్ కొట్టేశాడు.
యశ్ కొడుకుగా కనిపించిన బుడ్డోడు
మిఖాయిల్ ‘టాక్సిక్’లో ఆడమ్ అనే పాత్రలో కనిపించాడు. సినిమాలో యశ్ పోషించిన రాయా, రుక్మిణి వసంత్ పోషించిన మెలిస్సా దంపతుల కొడుకుగా అతని పాత్ర ఉంటుంది. స్క్రీన్ టైమ్ ఎక్కువగా లేకపోయినా, కనిపించిన సన్నివేశాల్లో మాత్రం మిఖాయిల్ తన నటనతో మంచి ఇంపాక్ట్ చూపించాడు. తొమ్మిదేళ్ల వయసులోనే ఇంత పెద్ద సినిమాలో నటించడం, అందులోనూ యశ్ లాంటి పాన్ ఇండియా స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అతని కెరీర్లో ప్రత్యేకమైన విషయంగా మారింది.
Also Read
- The Paradise : సెప్టెంబర్ 24న ప్యారడైజ్ రిలీజ్ ఫిక్స్.. చుట్టేస్తున్నారా?
- 2026 Tollywood : ఫేడౌట్ హీరోలకు కలిసివచ్చిన 2026.. వరుస ప్లాపుల తర్వాత దక్కిన ఊరట!
- Epic: తమ్ముడి కోసం రంగంలోకి విజయ్ దేవరకొండ.. ‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రౌడీ హీరో?
- Small Budjet Movies : చిన్న బడ్జెట్ సినిమాలకు రొమాన్స్, బోల్డ్, ఇంటిమేట్ సీన్స్నే సేఫ్ ఫార్ములాగా భావిస్తున్నారా?
రాజవంశ నేపథ్యం ఉన్న కుటుంబం
రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమాతో బాలనటుడిగా పరిచయమైన మిఖాయిల్ రావ్ ఖాన్ ప్రస్తుతం నోయిడాలోని ‘స్టెప్ బై స్టెప్ స్కూల్’ లో 5వ తరగతి చదువుతున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్ ప్రాంతానికి చెందిన రాజ్‌పుత్ రాయల్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అతని తండ్రి పేరు షకీబ్ రావ్. అతని కుటుంబానికి ప్రత్యేకమైన నేపథ్యం ఉంది. మిఖాయిల్ తండ్రి షకీబ్ రావు చెప్పిన వివరాల ప్రకారం, అతని తాత మహ్మద్ అహ్మద్ ఖాన్‌కు బ్రిటిష్ పాలన సమయంలో ‘రావు సాహెబ్’ అనే బిరుదు కూడా లభించిందంట. ఇక సినిమాలతో పాటు ఫుట్‌బాల్, స్విమ్మింగ్, స్కెచింగ్, ర్యాపింగ్ అంటే కూడా అతనికి చాలా ఇష్టం.
మొదటి ఆడిషన్లో ఫెయిల్..
మిఖాయిల్ కి ‘టాక్సిక్’ అవకాశం గురించి అతని తల్లిదండ్రులు షకీబ్ రావు ఖాన్, అష్బా రషీద్ అతనికి చెప్పారు. నటనపై అవగాహన పెంచుకోవడానికి మిఖాయిల్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో క్లాసులు తీసుకున్నాడు. ఆ తర్వాత ముంబైలో ఆడిషన్‌కు వెళ్లాడు. అయితే మొదటి రౌండ్ అనుకున్నంత బాగా జరగలేదు. కానీ అదే రోజు రాత్రి జరిగిన రెండో రౌండ్లో మాత్రం మిఖాయిల్ అదరగొట్టాడు. అతని నటన చూసి అడిషన్ నిర్వాహకులు ఆశ్చర్యానికి గురయ్యారని మిఖాయిల్ చెప్పాడు. అలా చివరికి ఆడమ్ పాత్ర అతని చేతికి వచ్చింది.
యశ్‌ను చూసి భయపడ్డాడు..
మిఖాయిల్‌కు ‘టాక్సిక్’ షూటింగ్లో అన్నింటికంటే గుర్తుండిపోయే అనుభవం యశ్‌తో పరిచయం. మొదటిసారి యశ్‌ను కలవడానికి వెళ్లేటప్పుడు ఈ చిన్నారి చాలా కంగారుపడ్డాడట. గీతూ మోహన్‌దాస్ అతన్ని హోటల్లోని యశ్ గదికి తీసుకెళ్లారు. అక్కడ యశ్ చాక్లెట్లు, బ్రౌనీలు ఇచ్చి అతని టెన్షన్ పోగొట్టాడట. అంత పెద్ద స్టార్‌ను కలుస్తున్నాననే భయం ఉన్నప్పటికీ, యశ్ చాలా సింపుల్‌గా, ఫ్రెండ్లీగా మాట్లాడటంతో మిఖాయిల్ వెంటనే కంఫర్ట్ అయ్యాడు.
తెరపై రఫ్.. బయట మాత్రం చాలా కూల్
మిఖాయిల్ మాటల్లో చెప్పాలంటే ‘టాక్సిక్’లో తెరపై కనిపించే యశ్‌కు, షూటింగ్ సమయంలో తాను చూసిన యశ్‌కు చాలా తేడా ఉందట. సినిమాలో యశ్ పాత్ర చాలా రఫ్‌గా, ప్రమాదకరంగా కనిపిస్తే, నిజ జీవితంలో మాత్రం తనను పదేపదే బాగున్నావా, అంతా ఓకేనా అని అడిగేవాడట. అంతేకాదు కష్టపడి పనిచేయాలని, బలంగా ఉండాలని, ఎప్పుడూ బెస్ట్ ఇవ్వాలని సలహా ఇచ్చేవాడట యశ్. అందుకే ఇప్పటివరకు తాను కలిసిన మంచి మనుషుల్లో యశ్ ఒకరని మిఖాయిల్ చెబుతున్నాడు.
రుక్మిణితో కూడా మంచి బాండింగ్
రుక్మిణి వసంత్‌తో కూడా మిఖాయిల్‌కు మంచి అనుబంధం ఏర్పడింది. సినిమాలో ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందిన పాత్రలు చేయడంతో కలిసి వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. ఇద్దరికీ స్కెచింగ్ అంటే ఇష్టమని కూడా అప్పుడే తెలిసిందట. దీంతో షూటింగ్ అనుభవం మిఖాయిల్‌కు మరింత సరదాగా మారింది. సినిమాలో నయనతార, కియారా అద్వానీ లాంటి ప్రముఖ నటీమణులు ఉన్నప్పటికీ, వారితో మాత్రం మిఖాయిల్‌కు నేరుగా షూటింగ్ చేసే అవకాశం రాలేదు. అతని సన్నివేశాలు ఎక్కువగా యశ్, రుక్మిణితోనే ఉన్నాయి.
‘ఇది నిజమైన ప్రపంచమేనా?’ అనిపించిన సెట్స్
‘టాక్సిక్’ సెట్స్ కూడా మిఖాయిల్‌కు మర్చిపోలేని అనుభవాన్ని ఇచ్చాయి. బెంగళూరులో వేసిన భారీ సర్కస్ సెట్, స్మశానం సెట్, రాయా ఇల్లు అతనికి ప్రత్యేకంగా గుర్తుండిపోయాయి. అవి ఎంత భారీగా ఉన్నాయంటే తాను నిజంగా ఫిల్మ్ సెట్లో ఉన్నానా లేక నిజమైన ప్రపంచంలో ఉన్నానా అనేంతగా అనిపించిందని మిఖాయిల్ చెప్పాడు. అంత పెద్ద సినిమాలో, అంత పెద్ద స్టార్‌తో కలిసి నటిస్తున్నప్పటికీ తనకు సెట్లో ఎలాంటి ఒత్తిడి అనిపించలేదట. చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ తనను ఎంతో ఆప్యాయంగా చూసుకోవడమే అందుకు కారణమని చెప్పాడు.
కొడుకును తెరపై చూసి ఎమోషనల్ అయిన తల్లిదండ్రులు
మిఖాయిల్ తొలి సినిమా చూసిన అతని కుటుంబ సభ్యుల స్పందన కూడా భావోద్వేగంగా మారింది. తొలిసారి తమ కొడుకును వెండితెరపై చూసినప్పుడు అతని తల్లిదండ్రులు చాలా ఎమోషనల్ అయ్యారని మిఖాయిల్ గుర్తుచేసుకున్నాడు. తొమ్మిదేళ్ల వయసులోనే ఇలాంటి అనుభవం రావడం అతని కుటుంబానికి కూడా గర్వకారణంగా మారింది. ఇంత చిన్న వయసులోనే యశ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మిఖాయిల్, ఇప్పుడే సినిమానే తన భవిష్యత్తు అని మాత్రం చెప్పడం లేదు. నటన తన కల కాదని, కానీ భవిష్యత్తులో మరికొన్ని సినిమాల్లో నటించాలని మాత్రం ఆసక్తిగా ఉందని చెబుతున్నాడు ఈ బుడతడు.
- Tags
- cinema
తాజావార్తలు
-
Toxic: యశ్ ‘టాక్సిక్’లో ఈ 9 ఏళ్ల బుడ్డోడు ఎవరో తెలుసా? రాకీ భాయ్ ఇచ్చిన గిఫ్ట్‌ల వెనుక అసలు కథ ఇదే!
-
Cancer: వాసనతో కుక్క క్యాన్సర్‌ను గుర్తించగలదా? సైంటిస్టులు ఏం చెబుతున్నారు?
-
MLAs Arrested: పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్..!
-
PM Modi: పారిస్‌లో స్వామినారాయణ ఆలయాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ.. భారత్-ఫ్రాన్స్ బంధంపై కీలక వ్యాఖ్యలు
-
Telangana Assembly: అసెంబ్లీ గేటు దగ్గర గందరగోళం.. టీషర్ట్ విప్పి హరీష్ రావు ఆందోళన!
ట్రెండింగ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!