Digital Arrest Scam: ఈ మధ్య తరుచు డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎందరినో స్కామర్లు దోచుకుంటున్న విషయాలు చూస్తూనే ఉన్నాము. ఇలా స్కాంలో తాజాగా చిక్కుకున్న కర్ణాటక మాజీ ఎమ్మెల్యే గుండప్ప వకిల్ ఎనిమిది రోజుల్లో దాదాపు రూ. 31 లక్షలు పోగొట్టుకున్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అధికారి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP), ఒక న్యాయమూర్తిగా నటిస్తూ మోసగాళ్లు ఈ కుట్రకు పాల్పడ్డారు. అసలేమైందన్న విషయానికి వస్తే.. ఆగస్టు 12 సాయంత్రం…
సైబర్ నేరగాళ్ల తోకలు కత్తిరిస్తున్నారు తెలంగాణ పోలీసులు. వాళ్లకి మ్యూల్ అకౌంట్లు సమకూర్చిన నేరగాళ్లను గుర్తించారు. మొత్తంగా ఆరుగురిపై కేసులు పెట్టిన పోలీసులు.. తాజాగా ఒకరిని ముంబై ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. తెలంగాణ పోలీసులు సైబర్ నేరగాళ్ల భరతం పడుతున్నారు. మొన్ననే 25 మంది సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా మరో ముఠా బాగోతాన్ని బయట పెట్టారు. సైబర్ క్రిమినల్స్‌కు బ్యాంక్ అకౌంట్లు అందిస్తున్న నేరగాళ్లను గుర్తించారు.. ఇటీవల హైదరాబాద్‌లో ఉంటున్న…
వృద్ధుడికి మాయమాటలు చెప్పి భారీగా డబ్బులు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు సైబరాబాద్ పోలీసులకు చిక్కారు. టోలిచౌకి ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. వృద్ధుడి నుంచి రూ. 74.36 లక్షలు కాజేశారు. బాధితుడు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో అతని నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్నారు. నకిలీ ట్రేడింగ్ యాప్ లింకులు పంపి పెట్టుబడి పెట్టమని చెప్పి భారీగా మోసానికి పాల్పడ్డారు.
Cyber Fraud Village : ఐదు రాష్ట్రాల్లో భారీ ఆపరేషన్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ సిబ్బంది.. 23 మంది సైబర్ నేరగాళ్లను పట్టుకున్నారు. ఈ అరెస్ట్‌ల వివరాలను సైబర్ క్రైమ్ డీసీపీ కవిత వెల్లడిస్తూ.. ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్ నేరాలు పెరుగుతుండటంతో నిందితులను పట్టుకునేందుకు ఆపరేషన్ నిర్వహించినట్లు చెప్పారు. ఈ ఆపరేషన్‌లో 23 మంది సైబర్ నేరగాళ్ళని పట్టుకున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రలలో నిందితులు నేరాలకు పాల్పడినట్లు…