990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
- లెనోవో ఇన్నోవేషన్ వరల్డ్ 2026లో..
- కొత్త IdeaPad Vibe, ThinkBook ల్యాప్టాప్స్ లాంచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lenovo IdeaPad Vibe: లెనోవో ఇన్నోవేషన్ వరల్డ్ 2026 కార్యక్రమంలో కొత్త ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేసింది. ఇందులో భాగంగా IdeaPad Vibe 14, IdeaPad Vibe 15 మోడళ్లతో పాటు ThinkBook 14 Gen 9, ThinkBook 14x Gen 2 వంటి ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేశారు. AI ఫీచర్లు, కొత్త ప్రాసెసర్లు, ప్రీమియం డిజైన్‌తో వచ్చిన ఈ ల్యాప్‌టాప్‌లు వ్యక్తిగత, విద్య, ఆఫీస్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.
Lenovo IdeaPad Vibe series:
కొత్త IdeaPad Vibe సిరీస్ 14, 15 అంగుళాల స్క్రీన్ పరిమాణాల్లో లభిస్తుంది. వీటిలో Snapdragon X ప్రాసెసర్లతో పాటు Copilot+ PC సామర్థ్యాలు ఉన్నాయి. ఎంపిక చేసిన వేరియంట్లలో AMD Ryzen AI 400 సిరీస్ ప్రాసెసర్లు కూడా అందుబాటులో ఉంటాయి. స్నాప్‌డ్రాగన్ వేరియంట్లలో గరిష్ఠంగా 24GB మెమరీ, AMD వేరియంట్లలో డ్యూయల్ మెమరీ స్లాట్ల ద్వారా 32GB వరకు ర్యామ్‌ను పొందవచ్చు.
Also Read
- IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
- 165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
- 2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
- Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
ఈ ల్యాప్‌టాప్‌ల బరువు 1.3 కిలోల నుంచే ప్రారంభమవుతుంది. మెటల్ చాసిస్‌తో రూపొందించిన వీటిని ఆకర్షణీయమైన రంగుల్లో తీసుకొచ్చారు. Pantone Institute సహకారంతో ఎంపిక చేసిన డ్రీమీ వయొలెట్, స్పైసీ గోల్డ్, జెన్ గ్రీన్, చిల్ బ్లూ, రేడియంట్ కోరల్, మూడీ బ్లూ, లోకీ గ్రే రంగుల్లో ఇవి లభిస్తాయి. అలాగే కస్టమైజ్ చేసుకునే కీ క్యాప్‌లను విడిగా కొనుగోలు చేసి మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది.
AI ఫీచర్లు:
IdeaPad Vibe సిరీస్‌లోని ఎంపిక చేసిన మోడళ్లలో ఏఐ ఆధారిత ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. రియల్‌టైమ్ అనువాదం, వీడియో కాన్ఫరెన్సింగ్ ఎఫెక్ట్స్, కంటెంట్ క్రియేషన్, ప్రైవసీ వంటి పనుల్లో ఇవి ఉపయోగపడతాయి. ఎంపిక చేసిన వేరియంట్లలో OLED డిస్ప్లేలు అందుబాటులో ఉంటాయి. లో కీ గ్రే, మూడి బ్లూ రంగుల్లో వచ్చే OLED మోడళ్లు 100% వరకు DCI-P3 కలర్ కవరేజీని అందిస్తాయి. IPS డిస్ప్లే వేరియంట్లలో 120Hz రిఫ్రెష్ రేట్, 100 శాతం వరకు sRGB కవరేజీ ఉంటుంది.
స్టోరేజ్‌ను పెంచుకునేందుకు రెండు SSD స్లాట్లు ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా USB Type-A, USB Type-C పోర్టులు, HDMI, మైక్రోSD కార్డ్ రీడర్, ఆడియో జాక్ వంటి సదుపాయాలు ఉన్నాయి. TÜV లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ కూడా లభిస్తుంది. AMD Ryzen AI 400 Series వేరియంట్లలో 1TB వరకు SSD ఎక్స్పాన్షన్కు సపోర్ట్ ఉంటుంది. వీటిలో ఫుల్ మెటల్ బిల్డ్ లేదా మెటల్, పాలిమర్‌తో కూడిన టూ-టోన్ రిపుల్ డిజైన్ అందుబాటులో ఉంటుంది. 50Wh, 65Wh బ్యాటరీ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఇంటెల్ ప్రాసెసర్లతో కూడిన IdeaPad Vibe మోడళ్లు తరువాత అందుబాటులోకి రానున్నాయి.
ThinkBook 14:
ThinkBook 14 Gen 9 ల్యాప్‌టాప్‌లో Snapdragon X2 Plus ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది గరిష్ఠంగా 80 TOPS వరకు ఏఐ పనితీరును అందిస్తుంది. ఇందులో 14 అంగుళాల WUXGA డిస్ప్లే, 400 నిట్స్ బ్రైట్నెస్, ఆప్షనల్ టచ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్ మందం 17.7 మిల్లీమీటర్లు కాగా, బరువు 1.3 కిలోల నుంచి ప్రారంభమవుతుంది. కంటెంట్ క్రియేషన్, కొలాబరేషన్, రోజువారీ పనులు, ప్రొడక్టివిటీ కోసం Copilot+ PC ఫీచర్లను అందిస్తోంది. ఎంపిక చేసిన మోడళ్లలో Lenovo Qira ఏఐ అసిస్టెంట్ కూడా ఉంటుంది. ఇది మీటింగ్స్, సంభాషణల్లో ముఖ్యమైన విషయాలను గుర్తించేందుకు Pay Attention, Catch Me Up వంటి ప్రాంప్ట్‌లను అందిస్తుంది. లోకల్ వీడియో ప్లేబ్యాక్ 26 గంటల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది.
ThinkBook 14x Gen 2:
ThinkBook 14x Gen 2 కేవలం 12.9 మిల్లీమీటర్ల మందంతో, 990 గ్రాముల బరువుతో చాలా తేలికైన డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో Intel Core 7 Series 3 ప్రాసెసర్లు ఉంటాయి. బ్రౌజింగ్, ఆన్లైన్ మీటింగ్స్, క్లాసులు, ఆఫీస్ పనులు వంటి రోజువారీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందించారు. ప్రీమియం మెటాలిక్ ఫినిష్‌తో పాటు OLED డిస్ప్లే ఆప్షన్, LCD టచ్‌స్క్రీన్ ఆప్షన్ కూడా లభిస్తుంది. లూనా గ్రే, సెలెస్టియల్ వైట్, మిస్టిక్ వయోలెట్, వెయిల్ బ్లూ రంగుల్లో ఈ ల్యాప్‌టాప్ అందుబాటులో ఉంటుంది.
Lenovo Qira ఏంటి?
కొత్త IdeaPad, ThinkBook పోర్ట్‌ఫోలియోలో ఎంపిక చేసిన మోడళ్లలో Lenovo Qira వ్యక్తిగత ఏఐ అసిస్టెంట్‌గా పనిచేస్తుంది. PCలు, మొబైల్ డివైజ్‌లు, టాబ్లెట్లు, వేరబుల్స్‌లో ఇది పనిచేసేలా రూపొందించారు. ఇమెయిల్, క్యాలెండర్, కొలాబరేషన్ సేవలతో అనుసంధానం కోసం Workato ఆధారిత కనెక్షన్లను Qira ఉపయోగిస్తుంది. సహజ భాషలో ఇచ్చే ఆదేశాల ఆధారంగా అవసరమైన సమాచారాన్ని కనుగొనడం, వివిధ యాప్‌లు, సేవల మధ్య మారడం వంటి పనులను సులభతరం చేస్తుంది.
ధర:
* IdeaPad Vibe 14, 15: ప్రారంభ ధర సుమారు EUR 799 అంటే భారత కరెన్సీలో రూ.87,555. అక్టోబర్ నుంచి అందుబాటులోకి రానున్నాయి.
* ThinkBook 14 Gen 9: ప్రారంభ ధర EUR 1,099 అంటే రూ.1,20,430. అక్టోబర్ నుంచి లభిస్తుంది.
* ThinkBook 14x Gen 2: ప్రారంభ ధర EUR 1,079 అంటే రూ.1,18,235. ఈ నెల నుండే అందుబాటులోకి రానున్నాయి.
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?