TDP Leadership Training Conclave: చంద్రబాబుకు అభినందన తీర్మానం.. స్టాండింగ్ ఓవేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP Leadership Training Conclave: తెలుగుదేశం పార్టీ లీడర్షిప్ కాన్క్లేవ్లో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అభినందనలు తెలిపారు. ‘సీఈవో సీఎం టూ వాటర్‌మ్యాన్’ పేరుతో ఎకనామిక్ టైమ్స్ ప్రచురించిన కథనాన్ని ప్రస్తావిస్తూ మంత్రి నిమ్మల రామానాయుడు అభినందన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు సభలో స్టాండింగ్ ఓవేషన్‌తో నేతలు అభినందనలు తెలిపారు. ఐటీ విప్లవం ద్వారా తెలుగు వారికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకురావడంతో పాటు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నీటి నిర్వహణలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని తీర్మానంలో పేర్కొన్నారు. ‘జలం ఉంటేనే జనం.. అభివృద్ధి’ అనే నినాదంతో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.
పోలవరం, వెలిగొండ వంటి ప్రాజెక్టులపై ఎకనామిక్ టైమ్స్ ప్రశంసలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. పట్టిసీమ, హంద్రీనీవా ప్రాజెక్టుల ద్వారా నీటిని తరలించిన విధానాన్ని కూడా గుర్తుచేశారు. మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న వెలిగొండ కలను చంద్రబాబు సాకారం చేశారని పేర్కొన్నారు. ఏడాదిన్నరలో పోలవరం ఎడమ కాలువను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. గోదావరి జలాలను అనకాపల్లి వరకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. 2027 పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. రూ.35 వేల కోట్లతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భూగర్భ జలాల పెంపునకు ‘జలధార’ ప్రణాళికను అమలు చేయనున్నట్లు తెలిపారు. సాగునీరు, నీటి వనరుల అభివృద్ధికి చంద్రబాబు తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అభినందనలు తెలిపారు.
Also Read
- Janasena First List: 2 కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలకు జనసేన అభ్యర్థులు ఖరారు.. తొలి జాబితా పూర్తి వివరాలు ఇవే
- AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
- TDP Candidates 1st List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ తొలి జాబితా.. 61 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటు
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
వాటర్ మ్యాన్ సీబీఎన్‌కు
స్టాండింగ్ ఒవేషన్.. #ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/RehJszKg81— Telugu Desam Party (@JaiTDP) September 7, 2026
తాజావార్తలు
-
Destiny : కామెడీ వదిలేసి.. అడవిలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్!
-
WHO: ఇంట్లోనే విషం? 35లక్షల మరణాలకు కారణం ఇదే!
-
భారత్‌లో అత్యధిక మైలేజ్ ఇచ్చే హైబ్రిడ్ ఎస్యూవీ.. Renault Duster Hybrid లాంచ్.. ధర, ఫీచర్స్, ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
-
AP Municipal Elections 2026: బెజవాడలో కూటమి పార్టీల మధ్య సీట్ల చిచ్చు.. జనసేన, బీజేపీ డిమాండ్లతో ఉత్కంఠ
ట్రెండింగ్
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?