శ్రీశైలంలో అన్య మతస్థులకు షాపులు కేటాయించ వద్దన్న జీవో నెంబర్ 425పై స్టే కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శ్రీశైలం దేవస్థానం ప్రాంతంలో అన్య మతస్థులకు దుకాణాలు కేటాయించ వద్దని 2015లో ప్రభుత్వం జీవో 425 జారీ చేసిన విషయం తెలిసిందే. జీవో 425 ను సవాల్ చేస్తూ పలువురు దుకాణదారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు 2020లో జీవోపై స్టే విధించింది. స్టే విధించినప్పటికీ ప్రభుత్వం మళ్లీ టెండర్లను పిలిచింది.…