తెలుగు చిత్రసీమ మూగబోయింది. చిత్రసీమలోని తార ఆకాశంలో ధృవతారగా మిగిలిపోయింది. సూపర్ కృష్ణ మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటును కలిగించింది. ఆయన మృతిపై ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. అయితే.. తాజాగా పద్మాలయ స్టూడియో నుంచి కృష్ణ అంతిమయాత్ర ప్రారంభమైంది. కృష్ణను కడసారి చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే.. మహా ప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం. మహాప్రస్థానానికి కృష్ణ అంతిమయాత్ర ప్రారంభం కావడంతో అటువైపు వెళ్లే దారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.
Also Read : Qualcomm Snapdragon 8 Gen 2 SoC: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ కొత్త చిప్‌సెట్ ఆవిష్కరణ.. కొత్త చిప్‌సెట్‌తో రాబోతున్న ఫోన్లు ఇవే..
ఇదిలా ఉంటే.. కృష్ణ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ గాంధీభవన్‌లో ఆయన చిత్రపటానికి మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంతరావు, కుమార్ రావ్ తదితరులు నివాళులు అర్పించారు. అంతకుముందు.. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేష్ కుటుంబసభ్యులను పరామర్శించారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సైతం కృష్ణ పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కృష్ణ కుటుంబసభ్యులను పరామర్శించారు మంత్రి తలసాని. వీరితో పాటు.. కృష్ణ కి ఏపీ మంత్రి రోజా, గవర్నర్ తమిళిసై, ఏపీ సీఎం జగన్ పరామర్శించారు. సూపర్‌స్టార్ కృష్ణకు నివాళులర్పించిన అనంతరం సీఎం వైఎస్ జగన్.. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. సీఎం జగన్.. మహేష్ తోపాటు.. కుటుంబసభ్యులందరినీ పరామర్శించారు.