బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్, సీనియర్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్రలలో నటించిన మూవీ ఆర్టికల్ 370..పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 23వ తేదీన రిలీజ్ అయి కమర్షియల్‍గా సూపర్ హిట్ అయింది. అంచనాలకు మించి వసూళ్లను రాబట్టింది. సినిమా ఆరంభం నుంచి ఎంతో ఆసక్తిని రేపింది. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని ప్రభుత్వం ఎత్తివేసిన అంశంపై ఈ చిత్రం తెరకెక్కింది.ఆర్టికల్ 370 సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ‘జియోసినిమా’ ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. ఈ చిత్రం ఏప్రిల్ 19వ తేదీన జియోసినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుందని సమాచారం. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆదిత్య సుహాస్ జంబాలే దర్శకత్వం వహించిన ఈ చిత్రం థ్రిల్లింగ్ కథనంతో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఆర్టికల్ 370 సినిమా సుమారు రూ.20 కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కింది. ఈ చిత్రానికి ఆరంభంలో పెద్దగా వసూళ్లు రాలేదు. అయితే, ఆ తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు పెరిగాయి. లాంగ్ రన్‍లో ఈ చిత్రం బాగా ఆడుతోంది. రిలీజై నెల అయినా.. ఇంకా ఈ మూవీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సుమారు రూ.105 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. దీంతో కమర్షియల్‍గా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది.ఆర్టికల్ 370 సినిమాలో ఎన్ఐఏ ఏజెంట్‍గా యామి గౌతమ్ మరియు పీఎంవో జాయింట్ సెక్రటరీగా ప్రియమణి యాక్టింగ్ హైలైట్‍గా నిలిచింది. రాజ్ అరుణ్, శివమ్ ఖజురియా, వైభవ్ తత్వవాది, అరుణ్ గోవిల్, రాజ్ జుత్షి, దివ్య సేథ్ మరియు కిరణ్ కర్మాకర్ ఈ చిత్రంలో కీరోల్స్ చేశారు.కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా ఆర్టికల్ 370 చిత్రాన్ని తెరకెక్కించినట్టు ఈ మూవీ టీమ్ పేర్కొంది. ఈ అంశాన్ని గ్రిప్పింగ్‍గా తెరపై చూపించడంలో దర్శకుడు ఆదిత్య బాగా సక్సెస్ అయ్యారనే ప్రశంసలు వచ్చాయి. బీ62 స్టూడియోస్, జియో స్టూడియోస్ పతాకాలపై జ్యోతి దేశ్‍పాండే, ఆదిత్య ధార్ మరియు లోకేశ్ ధార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.