Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Sundar Pichai Shares His Dads Reply To His First Email 25 Years Ago

Sundar Pichai: గూగుల్‌కు 25 ఏళ్లు.. ఉద్యోగులను ఉద్దేశించి సీఈవో బ్లాగ్

Published Date :September 6, 2023 , 9:34 pm
By Mahesh Jakki
Sundar Pichai: గూగుల్‌కు 25 ఏళ్లు.. ఉద్యోగులను ఉద్దేశించి సీఈవో బ్లాగ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sundar Pichai: గూగుల్‌.. ప్రస్తుతం ప్రతీ ఒక్కరికి కనీస అవసరంలాగా మారిపోయింది. సెర్చ్ ఇంజన్‌ అనగానే గుర్తొచ్చే మొదటి పేరు గూగుల్. అంతలా ఎదిగిపోయింది మరీ ఆ సంస్థ. ఏ విషయం అడిగినా ప్రతి ఒక్కరు గూగుల్‌ సెర్చ్ చేయడం సాధారణమైపోయింది. అంతటి దిగ్గజ సంస్థ పుట్టి నేటికి 25 ఏళ్లు అయింది. ఈ క్రమంలో గూగుల్‌ సీఈవో సుందర్ పిచాయ్ తమ ఉద్యోగులను ఉద్దేశించి ఓ బ్లాగ్ రాశారు. ఆ బ్లాగ్‌లో తన వ్యక్తిగత అనుభవాలతో పాటుగా గూగుల్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దాంట్లో తన వ్యక్తిగత అనుభవాలు సహా గూగుల్‌కు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకోవడం విశేషం. కొన్నేళ్ల కిందట తన తండ్రితో పిచాయ్.. ఎలా కమ్యూనికేట్ చేసేవారో కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు సుందర్ పిచాయ్. ఇప్పుడు తన పిల్లలు కూడా ఏదైనా సమాచారాన్ని క్షణాల్లోనే ఎలా బదిలీ చేయగలుగుతున్నారో వివరించారు. ఒకప్పుడు అలవాటు పడేందుకు ఏళ్లు పట్టిన టెక్నాలజీ.. ఇప్పటి పిల్లలు మాత్రం క్షణాల్లోనే ఆకళింపు చేసుకుంటున్నట్లు చెప్పారు. ఇక పిల్లలు ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ కథల్లా విన్నవే.. ఇప్పుడు వారి కళ్ల ముందు కదలాడుతున్నాయని పేర్కొన్నారు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.

Also Read: Car on Fire: కదులుతున్న కారులో మంటలు.. కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్న డ్రైవర్

ఆయన ఆ బ్లాగ్‌ రాస్తూ..’చాలా సంవత్సరాల క్రితం నేను అమెరికాలో చదువుతున్నప్పుడు భారత్‌లో ఉంటున్న మా నాన్నకు తొలి ఈ-మెయిల్ అడ్రస్ వచ్చింది. నా తండ్రితో కమ్యూనికేట్ చేయడానికి వేగవంతమైన, చవకైన మార్గం లభించినందుకు నేను చాలా సంతోషించాను. అందుకే నాన్నకి ఈ మెసేజ్ పంపాను. అప్పుడు నేను చాలా వెయిట్ చేశాను. ఆయన నుంచి సమాధానం రావడానికి నాకు 2 రోజులు పట్టింది. డియర్ పిచాయ్, ఈ-మెయిల్ అందుకున్నాను అని రాశారు.” అని బ్లాగ్‌లో పేర్కొన్నారు సుందర్‌ పిచార్. ఈ-మెయిల్ రావడం ఆలస్యం కావడంతో, పిచాయ్ తన తండ్రికి కూడా ఫోన్ చేశారు.

“ఇదిలా ఉంటే ఈ కాలంలో సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందింది. ఒకసారి నేను నా కొడుకుతో ఉన్నాను. ఏదో చూసి మొబైల్‌లో ఫోటో తీశాడు. ఆపై స్నేహితులకు షేర్ చేసుకున్నారు. తర్వాత ఒకరికొకరు మెసేజ్‌లు పంపుకున్నారు. జేబులోంచి ఫోన్ తీసినంత వేగంగా అదంతా జరిగింది. కొన్నేళ్ల క్రితం నేను నా తండ్రికి మెసేజ్ పంపిన తీరుతో పోలిస్తే, ఈ రోజు నా కొడుకు తన తండ్రితో సంభాషించే విధానం, తరాల మధ్య ఎంత మార్పు జరుగుతుందో చూపిస్తుంది.” అని బ్లాగ్‌ రాసుకొచ్చారు. అంటే ఆ కాలంలో టెక్నాలజీ, ఈ కాలంలో జరిగిన అభివృద్ధికి ఆయన తేడాను తెలిపారు.

కుప్పలు తెప్పలుగా ఉన్న సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఒక క్రమ పద్ధతిలో అందించాలన్న లారీ పేజ్‌, సెర్గీ బ్రిన్‌ ఆలోచనతోనే గూగుల్‌ మిషన్ ప్రారంభమైందని సుందర్‌ పిచాయ్ ఆ బ్లాగ్‌లో తెలిపారు. అలా గూగుల్ సెర్చ్ పేరుతో తీసుకొచ్చిన ప్రొడక్ట్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తే కోట్లాది మందికి పరిష్కారాలను వెతికి పెట్టిందని అన్నారు. సరైన సమాధానాలు వెతికిచ్చే గూగుల్ సామర్థ్యం చూసిన తాను ఆశ్చర్యపోయేవాడినని పాత రోజుల్ని గుర్తుచేసుకున్నారు. ‘నల్లా కారుతుంటే దానిని మరమ్మతు ఎలా చేయడం?’ అనే దాని దగ్గర నుంచి.. తాను ఉద్యోగం కోసం వెతుకుతున్న సమయంలో ‘గూగుల్ ఇంటర్వ్యూ ఎదుర్కోవడం ఎలా?’ అనే వరకు ఇలా ఎన్నో ప్రశ్నలకు గూగుల్ తనకు సమాధానం ఇచ్చిందని చెప్పారు పిచాయ్. సమయం గడుస్తున్న కొద్దీ తాను అడిగే ప్రశ్నల తీరుతో పాటు.. గూగుల్ ఆన్సర్ చేసే విధానంలో కూడా ఎన్నో మార్పులొచ్చాయని వివరించారు.

Also Read: Apple IPhone: యాపిల్‌కు భారీ దెబ్బ!.. ఆ దేశంలో ఆఫీస్‌ పనులకు ఐఫోన్లు వాడొద్దట..

గూగుల్ ప్రస్తుతం ఒక సెర్చ్ బాక్స్ మాత్రమే కాదని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెప్పుకొచ్చారు. పదుల సంఖ్యలో గూగుల్ ప్రొడక్ట్స్ అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. రోజూ కోట్లాది మంది ఈ సేవలు వినియోగించుకుంటున్నట్లు వివరించారు. ఈ క్రమంలో వచ్చిన క్రోమ్, యూట్యూబ్‌లు జ్ఞాన సముపార్జనకు బలమైన వేదికలుగా మారాయని అన్నారు. టెక్నాలజీ రంగంలో క్లౌడ్ సంచలనం సృష్టించిందని చెప్పుకొచ్చారు. తమ ప్రయాణంలో ప్రతి దశలోనూ తమకు ఎన్నో సవాళ్లు ఎదురైనట్లు చెప్పుకొచ్చారు. గూగుల్‌వేవ్ విఫలం అయిందని అన్నారు. 2000ల్లో అసలు వెబ్‌బ్రౌజర్‌గా ఎన్నాళ్లు మనుగడ సాధిస్తామనే ప్రశ్న వచ్చిందన్నారు. ప్రతిసారి కూడా బలమైన సమాధానాలు, పరిష్కారాలతో యూజర్ల ముందుకు వచ్చామని.. కొత్త కొత్త విధానాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు.

ఎన్నో రకాల ప్రొడక్ట్స్ తీసుకురావడం ఒక ఎత్తు అయితే.. వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించడం అతిపెద్ద సవాలు అని సుందర్ పిచాయ్ అన్నారు. అందుకే గూగుల్ తొలినుంచీ బాధ్యతాయుతంగా వ్యవహరించిందని చెప్పుకొచ్చారు పిచాయ్. అందరి సమాచారం, గోప్యతకు భద్రత కల్పించడం తమ ప్రాధాన్యాంశంగా ఎంచుకున్నట్లు వివరించారు. ఇప్పుడు ఏఐని రానున్న పదేళ్లలో అందరికీ మరింత సహాయకారిగా మార్చడం, బాధ్యతాయుతంగా అమలు చేయడమే తమ ముందున్న లక్ష్యమని సుందర్ పిచాయ్ చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • business news
  • email
  • google ceo
  • Sundar Pichai
  • Technology

తాజావార్తలు

  • RK Roja: రేవంత్‌రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం.. ఏపీ ప్రయోజనాలు తెలంగాణకు తాకట్టు..!

  • Thimmarajupalli TV: కిరణ్ అబ్బవరం నిర్మాణంలో ‘తిమ్మరాజుపల్లి టీవీ’.. ట్రైలర్ డేట్ ఫిక్స్!

  • Story Board: ఇరాన్‌ షరతులకి అమెరికా తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

  • RR vs MI: “వైభవ్ vs బుమ్రా”.. తొలిసారి యంగ్ సెన్సేషన్, యార్కర్ కింగ్ మధ్య అసలైన ఫైట్!

  • స్టైలిష్ లుక్స్, శక్తివంతమైన ఇంజిన్‌తో Volkswagen Taigun.. ఈ SUV మార్కెట్‌లోకి వచ్చేది ఎప్పుడంటే..?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions