ఈమధ్య వస్తున్న తెలుగు సినిమాలో కొన్ని ఎటువంటి అంచనాలు లేకుండా భారీ విజయాన్ని అందుకుంటే మరికొన్ని సినిమాల్లోని కాంబోలు మాత్రం జనాలను సంధిగ్ధంలో పడేస్తున్నాయి.. అలాంటి కాంబోలను అసలు ఊహించలేము.. అలాంటి కాంబోనే ఇది.. వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింస్ చేస్తూ ఫెమస్ అయిన హీరో సుహాస్ సినిమాల లైనప్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. రీసెంట్ గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది..
ఇప్పుడు అదే జోష్ లో వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు సుహాస్.. ఇక సుహాస్, కీర్తి సురేష్ కాంబోలో ఓ సినిమా రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. వీళ్లిద్దరి కాంబోలో ‘ఉప్పు కప్పురంబు’ అనే సినిమా రాబోతుంది. అయితే ఇది డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కాబోతుంది.. అమెజాన్ నిర్మిస్తున్న ఒరిజినల్ సినిమా ఇది.. ఈ సినిమాకు ఐవి శశి దర్శకత్వం వహించగా.. ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై రాధికా లావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వసంత్ మురళీకృష్ణ ఈ సినిమాకు కథను అందించారు.. నిన్న ముంబైలో జరిగిన ప్రైమ్ ఈవెంట్ లో ఈ సినిమాను అఫిషియల్ గా ప్రకటించారు..
ఈ సినిమా గురించి విన్న సుహాస్ ఫ్యాన్స్ అంత పెద్ద హీరోయిన్ సుహాస్ తో నటించడం చాలా ఆనందంగా ఉందంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఈ చిత్రంలో కీర్తి సురేష్-సుహాస్ జంటగా కనిపిస్తారా లేక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారా అనేది చూడాలి.. ఇక సుహాస్ ప్రస్తుతం నాలుగు, ఐదు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.. ప్రసన్న వదనం, శ్రీరంగనీతులు, గొర్రె పురాణం, ఆనందరావు అడ్వెంచర్స్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో చూడాలి..