తమిళస్టార్ హీరో శివకార్తికేయన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా ఆయన సినిమా వస్తుంటాయి.. దాంతో ఇక్కడి ప్రజలకు కూడా ఈయన పేరు సుపరిచితమే.. ఈ ఏడాది సంక్రాంతికి అయలాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. తమిళంలో సంక్రాంతికి థియేటర్లలో రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది అయలాన్ మూవీ. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా దాదాపు 97 కోట్ల కలెక్షన్స్ ను అందుకుంది..
ఈ సినిమా భారీ సక్సెస్ ను అందుకుంది..2024లో కోలీవుడ్‌లో అత్యధిక వసూళ్లను దక్కించుకున్న సినిమాల్లో ఒకటిగా మంచి విజయాన్ని అయితే ఓటీటీలోకి మాత్రం ఆలస్యంగా రాబోతుంది.. ఓటీటీ విడుదల పై గతంలో ఎన్నో వార్తలు వినిపించిన కూడా మేకర్స్ ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు.. తాజాగా ఓటీటీలోకి విడుదల కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి..
సంక్రాంతికి తెలుగులో స్ట్రెయిట్ సినిమాల పోటీ ఎక్కువగా ఉండటంతో ఆలస్యంగా తెలుగు వెర్షన్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది.. తాజాగా ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయలాన్ మూవీ ఓటీటీ హక్కులను సన్ నెక్స్ట్ దక్కించుకుంది.. ఈ నెల 19 న ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుందని తెలుస్తుంది.. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది..