కడప జిల్లాలోని కమలాపురం శ్రీ బాలయోగి గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసింది. హాస్టల్ గదిలో గొంతు కోసుకుని విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. నొప్పితో బాధపడుతున్న విద్యార్థిని తోటి విద్యార్థులు గమనించారు.
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య పాల్పడింది. తనకు స్నేహితుల కంటే తక్కువ మార్కులు వచ్చాయని క్లాస్ రూమ్ లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఘనపూర్ లోని హ్యాపీ ఆరఫాన్ హోమ్ లో ఘటన చోటు చేసుకుంది.. కాసర్ల సతీష్ కుమార్తె స్వప్న (20) తన చిన్నప్పుడే తల్లి చనిపోవడం వల్ల అతని తండ్రి అయిన సతీష్ 2009వ సంవత్సరంలో ఆర్ఫాన్ హోమ్ లో చేర్పించాడు..…
Vijayawada: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫలితాలు విడుదలైన తర్వాత.. ఫెయిల్ అయిన విద్యార్థులు కొందరు ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా, విజయవాడలోని తాడిగడప కాలేజీ చైతన్య హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థి ప్రాణాలు తీసుకుంది.. నిన్న హాస్టల్‌లో ఊరివేసుకుని ఇంటర్ విద్యార్థిని వాణి ఆత్మహత్య చేసుకుంది.. ఇంటర్‌లో ఒక్క సబ్జేక్ట్ ఫెయిల్ కావడంతో ఇతర విద్యార్థుల ముందు లెక్చరర్ మందలించారట.. తోటి విద్యార్థుల ముందు లెక్చరర్ వ్యవహరించిన తీరుతో మనస్తాపానికి గురైన ఆ బాలిక ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్నారు..…
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలురా గ్రామంలో ఇంటర్ విద్యార్థిని వైష్ణవి కుటుంబ సభ్యులు ఉంటున్నారు. రోజూలాగానే నీళ్లకోసం కుళాయి వద్దకు వెళ్లింది. అయితే మిగతావారు కూడా కుళాయి వద్దకు చేరుకుని నీళ్లు పడుతున్న సమయంలో ఒకనొకరు నేనంటే నేను ముందు అంటూ గొడవకు దిగారు.