Hero MotoCorp launched Hero Splendor Plus Xtec 2.0: భారత దేశంలో ‘స్ల్పెండర్’ బైక్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మార్కెట్‌లోకి ఎన్ని రకాల బైక్‌లు వచ్చినా.. ఎక్కువ మంది కోరుకునేది స్ల్పెండర్‌నే. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలకు ఫస్ట్ చాయిస్‌గా మారింది. ఎక్కువ మైలేజ్, తక్కువ ఖర్చు, చాలా కాలం పాటు మన్నిక, సూపర్ లుక్ కారణంగా స్ల్పెండర్ బైక్ ఆటో మార్కెట్‌ను ఏళ్లుగా శాసిస్తోంది. డిమాండ్ దృష్ట్యా కంపెనీ కూడా ఇందులో మోడల్స్ తీసుకొచ్చింది. స్ల్పెండర్ మార్కెట్లోకి వచ్చి 30 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ‘హీరో మోటోకార్ప్’ కొత్త వెర్షన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది.
‘స్ల్పెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ 2.0’ పేరిట హీరో మోటోకార్ప్ కొత్త వెర్షన్ రిలీజ్ చేసింది. ఈ బైక్ ధర ఢిల్లీ ఎక్స్-షోరూమ్‌లో రూ.82,911గా ఉంది. గత ఎక్స్‌టెక్ వెర్షన్‌తో పోలిస్తే.. ఏ బైక్ ధర రూ.3,000 అధికం. లీటరుకు 73 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. సర్వీస్ వ్యవధిని 6,000 కిలోమీటర్లకు పెంచింది. కొత్త స్ల్పెండర్ 100 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తోంది. ఫోర్ స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తున్న ఈ బైక్.. 7.09 బీహెచ్‌పీ శక్తి, 8.05 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ మ్యాట్ గ్రే, గ్లోస్ బ్లాక్, గ్లోస్ రెడ్ రంగుల్లో ఇది అందుబాటులో ఉంది.
Also Read: Sathyaraj-SSMb29: రాజమౌళి-మహేశ్ ప్రాజెక్ట్‌లో అవకాశం.. క్లారిటీ ఇచ్చిన కట్టప్ప!
స్ల్పెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ 2.0 డిజైన్‌లో కంపెనీ పెద్దగా మార్పులు చేయలేదు. ఫీచర్లను మాత్రం అదనంగా ఇచ్చింది. పొజిషన్ ల్యాంప్‌తో కూడిన ఎల్‌ఈడీ హెడ్‌లైట్, వెనక భాగంలో హెచ్ ఆకారంలో ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్ ఇచ్చారు. సీటు పొడవు, గ్లవ్ బాక్స్ పరిమాణాన్ని కాస్త పెంచారు. ఇది డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో వస్తోంది. ఎకో ఇండికేటర్, రియల్-టైమ్ మైలేజీ మీటర్, సర్వీస్ రిమైండర్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ (యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, కాల్స్, మెసేజ్‌లు, బ్యాటరీ అలర్ట్స్) ఉంటుంది. హజార్డ్ స్విచ్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కటాఫ్ వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.