Strange Death: గొంతులో కోడిగుడ్డు ఇరుక్కుని వ్యక్తి మృతి!
- కాంచీపురం జిల్లాలో విషాదకర ఘటన
- గొంతులో కోడిగుడ్డు ఇరుక్కుని వ్యక్తి మృతి
- ప్రథమ చికిత్స చేసినా లాభం లేకపోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanchipuram Man Dies After Choking on Boiled Egg: ‘మృత్యువు’ ఎవరిని ఎప్పుడు ఎలా బలితీసుకుంటుందో చెప్పలేం. అప్పటివరకూ మన పక్కన ఉన్నవారే.. ఊహించని విధంగా చనిపోతుంటారు. ఊహించని రీతిలో రోడ్డు ప్రమాదం జరగడం, ఉన్నపలంగా గుండెపోటు రావడం, గొంతులో మటన్ ముక్క ఇరుక్కుని పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు మనం చూస్తున్నాం. తాజాగా అలాంటి విషాదకర ఘటన తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలో చోటుచేసుకుంది. గొంతులో కోడిగుడ్డు ఇరుక్కుని ఓ వ్యక్తి మృతి చెందాడు.
Also Read: US Open 2025: ఔరా.. వీనస్ విలియమ్స్! 45 ఏళ్ల వయసులోనూ
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
రవి (55) అనే వ్యక్తి కాంచీపురం జిల్లా ఉత్తిరమేరూర్ పంచాయతీ యూనియన్ మలైయాంగుళం గ్రామంలో నివసిస్తున్నాడు. రవికి భార్య వలర్మతి (45), కుమార్తె స్నేహ (24) ఉన్నారు. అతడు భవన నిర్మాణ కార్మికుడుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బుధవారం రాత్రి రవి భోజనం చేస్తూ.. ఉడకబెట్టిన కోడిగుడ్డును నమలకుండా అలానే మింగేశాడు. గుడ్డు గొంతులో చిక్కుకోవడంతో ఊపిరాడక విలవిలల్లాడాడు. వెంటనే కుటుంబ సభ్యులు పడూర్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అయితే రవి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!