కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామంలో వింత జీవుల సంచారం కలకలం రేపుతోంది. బూరుగుపల్లి గ్రామ చెరువు కట్ట మైసమ్మ వద్ద దూలం కృష్ణ అనే వ్యక్తి తన పొలం వద్ద పాడి గేదెలకు మేత వేస్తుండగా చెరువు కట్ట వద్ద పది నుంచి 15 వరకు వింత రకం జీవులు కనిపించడంతో భయాందోళనకు గురి అయ్యాడు. గ్రామస్తులకు విషయాన్ని తెలుపగా కొంతమంది వీటిని నీటి కుక్కలుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఇలాంటి వింత జీవులను మునుపెన్నడూ చూడలేదని వీటి ద్వారా మనుషులకు ప్రమాదం పొంచి ఉంటుందని రైతులు పొలాల వద్దకు వెళ్తే అవి మనుషులపై దాడి చేస్తే పరిస్థితి ఏమిటని గ్రామస్తులు భయాందోళనలకు గురి అవుతున్నారు. ఈ వింత జీవులు గ్రామ సమీపంలో ఉన్న కట్టపై సంచరిస్తూ కలకలం రేపుతూ ఉండడంతో ఇవి గ్రామంలోకి కూడా వస్తాయని సంబంధిత అధికారులు చొరవ చూపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Also Read : Weight Loss Side Effects: బరువు తగ్గడం కూడా ప్రమాదకరమే.. ఏం సమస్యలు వస్తాయంటే..!