School Headmaster: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం వెదురువలస గ్రామంలో జెడ్పీ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు (హెచ్‌ఎం) బుడుమూరు ఈశ్వరరావు ప్రవర్తపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఆ స్కూల్‌లో పనిచేసే ఉపాధ్యాయులు, విద్యార్థులు.. పాఠశాలలో ఉపాధ్యాయులందరినీ మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయానికి ఒక గంట ముందు పాఠశాల చేరుకున్నప్పటికీ ఫేస్ ఐడెంటిఫికేషన్ వేసినప్పటికీ ఆయన ఎందుకు ఆలస్యం అవుతున్నారని ఉపాధ్యాయులను వేధింపులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు.. మానసికంగా హింసిస్తున్నారు.. సెల్‌ఫోన్లలో మహిళా టీచర్ల మాటలను రికార్డు చేసి.. ఇతరకు పంపిస్తున్నారని ఉపాధ్యాయులు ఆరోపించారు..
Read Also: Meenakshi Lekhi: స్లోగన్స్ చేయకపోతే వెళ్లిపోండి.. యువతపై కేంద్ర మంత్రి ఫైర్
గతంలో ఈ విషయంపై పై అధికారులకు హెచ్‌ఎం ఈశ్వరరావుపై ఫిర్యాదు చేయగా.. అధికారులు ఆయనకు మెమో జారీ చేశారు.. తనకు మెమో రావడానికి మీరే బాధ్యులని.. అప్పటి నుంచి తమపై వ్యక్తిగతంగా కక్షపెట్టుకొని తమపై ఒత్తిడి చేస్తు్న్నారని.. పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏ తప్పు దొరుకుతుందా? అని ఆయన వెతుకుతూ ఉంటారు.. టైం ఫాలో అయినప్పటికీ జీతంలో కోత విధిస్తున్నారు.. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన మేం ఈ రోజు మా ప్రధాన ఉపాధ్యాయుడి మూలంగా రోడ్డుపైకి రావాల్సి వచ్చిందంటున్నారు. ఇక, విద్యార్థులతో టాయిలెట్స్‌లోకి నీరు మొయించడం.. మధ్య మధ్యలో ఉపాధ్యాయులతో గొడవ పడుతున్నారని.. పేరెంట్స్ మీటింగ్ పెట్టట్లేదని.. నాడు నేడు పనులకు అద్దంకి కలిగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు, టాయిలెట్స్‌లో సరైన నీటి సౌకర్యం లేదని.. ఆట స్థలం లేదని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. హెచ్‌ఎం ప్రవర్తన, ఉపాధ్యాయుల నుంచి సరైన సహకారం లేకపోతే విద్యార్థులు మొత్తం ఇతర స్కూళ్లకు వెళ్లిపోతామని విద్యార్థులు చెబుతున్నారు.