ఉప్పల్ స్టేడియానికి విద్యుత్ అధికారులు కరెంట్ సరఫనా నిలిపివేశారు. అయితే కొన్ని నెలల నుంచి బిల్లులు చెల్లించకపోవడం వల్లనే పవర్ కట్ చేశారు. ఉప్పల్ స్టేడియం నిర్వాహకులు విద్యుత్ బిల్లులు చెల్లించకుండా రూ.1.67 కోట్లు విద్యుత్ వాడుకున్నారని విద్యుత్ శాఖ తెలిపింది. కాగా.. కొన్ని నెలలుగా బిల్లులు కట్టకపోవడంతో పవర్ కట్ చేశామని విద్యుత్ అధికారులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే.. రేపు(శుక్రవారం) హైదరాబాద్, చెన్నై మధ్య మ్యాచ్ జరగనుంది. అందుకోసమని.. స్టేడియంలో ఆ జట్లు ప్రాక్టీస్ చేస్తుండగా…
ఆర్సీబీ ప్లేయర్స్ హైదరాబాద్ కు చేరుకున్నారు. అయితే డుప్లేసిస్ సేన ప్రాక్టీస్ లో మునిగిపోయింది. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు ఆ టీమ్ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కొత్త ఇంట్లో సందడి చేశారు.
ఎస్ ఆర్ హెచ్ టీమ్ లో కీలక ఆల్ రౌండర్ గా వాషింగ్టన్ సుందర్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. సీఎస్కేతో జరిగిన మ్యాచ్ లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసిన సుందర్ బౌలింగ్ లో కూడా ఒక్క వికెట్ పడగొట్టలేకపోయాడు. ఈ క్రమంలో వాషింగ్టన్ సుందర్ పై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పేరుకే ఆల్ రౌండర్ తప్ప పొడిచింది. ఏమి లేదని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
చెన్నై సూపర్ కింగ్స మరో కీలక పోరుకు సిద్దమైంది. చెపాక్ స్టేడియం వేదికగా ఇవాళ ( శుక్రవారం ) సైన్ రైజర్స్ హైదరాబాద్ తో సీఎస్కే టీమ్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ కు ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అడతాడని సమాచారం.
ఐపీఎల్ 2023లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవాళ కోల్ కతా నైట్ రైడర్స్ ను ఢీ కొట్టబోతుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కోల్ కతా నైట్ రైడర్స్ తో ఈడెన్ గెర్డెన్స్ వేదికగా ఎస్ ఆర్ హెచ్ తలపడనుంది.
కీలకమైన మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటర్లు చెలరేగారు. సెమస్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో మెరుపులు మెరిపించారు. ముంబై ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై బౌలర్లకు చుక్కలు చూపించారు సన్ రైజర్స్ బ్యాటర్లు. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు సాధించారు. ఫలితంగా ముంబై ముందు 194 పరుగుల భారీ టార్గెట్ పెట్టారు. సన్ రైజర్స్ బ్యాటర్లలో ప్రియంగార్గ్, త్రిపాఠి, నికోలస్…