మీమ్స్.. సీరియస్ విషయాన్ని కూడా ఎవ్వరి మనోభావాల్ని నొప్పించకుండా సున్నితంగా నవ్వు పుట్టించేలా చెప్పడమే. అలాంటి మీమ్స్ చేసే టాలెంట్ ఉంటే మీలో ఉందా.. కాలు కదపకుండా ఇంట్లో కూర్చొన్ లక్షలు సంపాదించవచ్చు. లేదంటే ఆఫీస్ లో కూర్చొని ఐటీ ఉద్యోగుల జీతాలకు ఏమాత్రం తీసిపోకుండా మీమ్స్ చేసుకుంటూ భారీ శాలరీ ప్యాకేజీ తీసుకోవచ్చు. ఆశ్చర్యపోతున్నారా.. లేదంటే నమ్మబుద్ది కావడం లేదా.. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగంతో మీమ్స్ ద్వారా ఎక్కువ మందిని చేరడం చిటికెలో పని. అందుకే పలు పేరిందిన కంపెనీలు కూడా మీమ్స్ ని తమ బ్రాండింగ్ కి వాడుకుంటున్నాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియా ఇప్పుడున్న ప్రధాన వేదికలు, యూజర్ల దృష్టిని ఆకట్టుకునేలా మీమ్స్ ని క్రియేట్ చేసి పోస్టే్ చేస్తే చాలు.. అవి వైరల్ అవుతూ సంస్థలకు కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చిపెడుతున్నాయి.
Also Read : Das Ka Dhamki : దాస్ ‘ధమ్కీ’ ఇస్తాడని వస్తే రవితేజ ‘ధమాకా’ చూపించాడు
అందుకే బెంగళూరుకు చెందిన స్టాక్ గ్రో అనే కంపెనీ మీమ్స్ తయారు చేసే మీమర్స్ కు బంపరాఫర్ ఇచ్చింది. చీఫ్ మీమ్ ఆఫీసర్ కు నెలకు రూ. లక్ష శాలరీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిపింది. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్ విభాగాల్లో మిలీనియల్స్, జెన్ జెడ్( జనరేషన్ జెడ్ ) వయసు వారే లక్ష్యంగా మీమ్స్ తయారు చేయాలంటూ లింక్డ్ ఇన్ పోస్ట్ పెట్టింది. ఇంకెందుకు ఆలస్యం మీమ్స్ చేసే టాలెంట్ ఉంటే చీఫ్ మీమ్ ఆఫీసర్ జాబ్ కొట్టేయండి.
Also Read : Bandi Sanjay: సిట్ నోటీస్ లు నాకు అందలేదు.. ఏ ఇంటికి అంటించారో తెలియదు
వయసును బట్టి వ్యక్తిల్ని ఐదు తరాలుగా విభజించవచ్చు.. వీరిలో తొలితరం సైలెంట్ జనరేషన్.. అంటే 1928-1945, మధ్య పుట్టి ఇప్పుడు 73-90 ఏళ్ల మధ్య వయసున్న వారు.. ఇక రెండో ప్రపంచ యుద్దం తరువాత రోజుల్లో అంటే 1946-1964 మధ్య జనానాల రేటు బాగా ఎక్కువగా ఉండడంతో అప్పుడు పుట్టి ప్రస్తుతం 54-72 మధ్య వయసున్నవారిని బేబీ బూమర్ జనరేషన్ గా పిలుస్తున్నారు. ఆ తరువాత 1964-80మధ్య పుట్టిన వారు జనరేషన్ ఎక్స్.. 1981 నుంచి 1996 మధ్య పుట్టి ప్రస్తుతం 22-37 సంవత్సరాల మధ్యనున్న వారంతా జనరేషన్ వై.. అంటే మిలీనియల్స్. ఆర్జనపరులైన వీరి సంఖ్య దేశంలో 50 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా.. ఆ తర్వాత పుట్టిన జనరేషన్ జెడ్ ఇప్పడిప్పడే ఉద్యోగాల్లోకి సంపాదనలోకి వస్తున్నారు.