Das Ka Dhamki : విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ జంటగా నటించిన దాస్ కా ధమ్కీ చిత్రం ఉగాది కానుకగా నేడు విడుదలైంది. అయితే, వైజాగ్ లోని ఓ థియేటర్లో సినిమా ప్రదర్శనలో గందరగోళం నెలకొంది. పట్టణంలోని సుకన్య థియేటర్లో ‘ధమ్కీ’కి బదులు రవితేజ నటించిన ‘ధమాకా’ చిత్రాన్ని ప్రదర్శించారు. ‘ధమాకా’ అనే టైటిల్ స్క్రీన్‌పై కనిపించగానే ప్రేక్షకులు గోల చేశారు. దీనిని గ్రహించిన థియేటర్ సిబ్బంది వెంటనే తప్పును సరిదిద్దుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సినిమా పేర్లు రెండూ కాస్త ఒకేలా ఉండటంతో ఈ విధమైన గందరగోళ పరిస్థితి నెలకొన్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు. ఇక, రవితేజ నటించిన ‘ధమాకా’ గతేడాది డిసెంబర్‌లో విడుదలై హిట్ అందుకుంది.
Read Also: Nandamuri Kalyan Ram: కళ్యాణ్ రామ్ ‘డెవిల్’.. పక్కా పాన్ ఇండియా లెవల్
విశ్వక్‌సేన్ స్వీయ దర్శకత్వంలోనే ఈ సినిమా రూపుదిద్దుకుంది. వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మించిన దీనికి లియాన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇందులో అక్షర గౌడ, రావు రమేష్, తరుణ్ భాస్కర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మధ్య కాలంలో సరైన హిట్ కోసం వేచి చూస్తోన్న విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. ఓ పేద కుర్రాడు.. అనుకోని పరిస్థితుల్లో కార్పోరేట్ కంపెనీకి సీఈవోగా వెళ్లడం.. అక్కడ అతడికి చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఎదురు కావడం వంటి కథాంశాలతో ఈ సినిమా రూపొందింది. ఇప్పటికే ప్రదర్శితమైన ఈ సినిమాకు అన్ని చోట్లా మిక్స్‌డ్ టాక్ వచ్చింది.
#DasKaDhamki show lo #Dhamaka Movie Play chesaru anta 😂🤣🤣 pic.twitter.com/squL57e0St
— చంటిగాడు లోకల్ 😎 (@Harsha_offll) March 22, 2023