Stock Market Opening: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అమెరికా మార్కెట్లు ఊపందుకోవడంతోపాటు భారత మార్కెట్‌పై కూడా ఆ ప్రభావం కనిపించింది. దేశీయ మార్కెట్లు బలమైన బౌన్స్‌తో ప్రారంభమవడంలో ఇన్వెస్టర్ల ముఖాలు ప్రకాశవంతంగా వెలిగిపోతునన్నాయి. మార్కెట్ 400 పాయింట్ల లాభంతో ప్రారంభం కాగా, వెంటనే ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా జంప్‌ను ప్రదర్శిస్తోంది.
స్టాక్ మార్కెట్ ఓపెనింగ్ ఎలా ఉంది?
నేటి మార్కెట్ ప్రారంభాన్ని పరిశీలిస్తే, సెన్సెక్స్ 442.07 పాయింట్లు లేదా 0.70 శాతం పెరుగుదలతో 64,033 స్థాయి వద్ద ప్రారంభమైంది. అయితే NSE నిఫ్టీ 130.85 పాయింట్లు లేదా 0.69 శాతం పెరుగుదలతో 19,120.00 స్థాయి వద్ద ప్రారంభమైంది.
Read Also:Manipur: కోలుకోని మణిపూర్.. ఆయుధాల కోసం పోలీసు స్టేషన్‌ను చుట్టుముట్టిన దుండగులు
సెక్టోరల్ ఇండెక్స్
నిఫ్టీ అన్ని రంగాల సూచీలు పెరుగుదలతో ట్రేడవుతున్నాయి. రియల్టీ రంగంలో గరిష్టంగా 1.40 శాతం పెరుగుదల కనిపించింది. కాగా పీఎస్‌యూ స్టాక్స్‌లో 1.38 శాతం జంప్ కనిపిస్తోంది. ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో 1.34 శాతం పెరుగుదల నమోదైంది. మీడియా షేర్లు 1.25 శాతం, ఐటీ షేర్లు 1.23 శాతం లాభపడ్డాయి.
నేటి స్టాక్ మార్కెట్ ప్రత్యేకతలు
ఐటి, బ్యాంకింగ్, చిన్న-మధ్యతరహా స్టాక్‌ల బూమ్ కారణంగా నేడు స్టాక్ మార్కెట్‌కు చాలా మద్దతు లభిస్తోంది. మార్కెట్ ప్రారంభమైన నిమిషాల్లోనే సెన్సెక్స్‌లో 500 పాయింట్ల జంప్ నమోదైంది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 28 లాభాలతో ట్రేడవుతుండగా, 50 నిఫ్టీలో 49 షేర్లు గ్రీన్‌లో బలంగా ట్రేడవుతున్నాయి.
Read Also:Pawan Kalyan: చిరు చరణ్ మధ్యలో పవన్… ఇన్ని ఫొటోల్లో ఏ ఫోటో ఇవ్వని ఆనందం ఈ ఫోటో ఇచ్చింది