NTV Telugu Site icon

TJR Sudhakar Babu: చిన్న చిన్న కారణాలతో ఇళ్ల పట్టాలు రద్దు చేస్తామనటం దుర్మార్గం..

Tjr Sudhakar Babu

Tjr Sudhakar Babu

చంద్రబాబు గత పరిపాలనలో పేదలకు సెంటు భూమి ఇచ్చిన చరిత్ర లేదని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు.. గత వైసీపీ హయంలో 30.6 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారన్నారు.. జగన్ పేదల ఇళ్ల స్థలాల కోసం 15 వేల కోట్లతో భూములు కొనుగోలు చేశారన్నారు. దేశంలోని ఏ రాజకీయ పార్టీ కూడా పేదల స్థలాల కోసం ఇంత ఖర్చు చేయలేదన్నారు.. ఇప్పటికే లబ్ధిదారులకు పంపిణీ చేసిన భూములను రద్దు చేసి మరోసారి పంపిణీ చేసేందుకు సిద్ధం కావటం దారుణమని విమర్శించారు.. చిన్న చిన్న కారణాలతో ఇళ్ల పట్టాలు రద్దు చేస్తామనటం దుర్మార్గమని మండిపడ్డారు..

READ MORE: Thaman : మీ మాటలు జీవితాంతం గుర్తు ఉంటాయి.. చిరు ట్వీట్‌కు త‌మ‌న్ రిప్లై

జగనన్న కాలనీలపై నాడు విమర్శలు గుప్పించి.. నేడు అదే స్థలాలు పంపిణీ చేస్తామంటున్నారని టీజేఆర్ సుధాకర్ బాబు తెలిపారు.. ఇళ్ల పట్టాలు పొందిన వారిలో కూటమి పార్టీలకు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారన్నారు.. జగన్.. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలపై లబ్ధిదారులకు సర్వ హక్కులు ఇచ్చారని చెప్పారు. కూటమి ప్రభుత్వం..పేదలను భయ బ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపించారు. చంద్రబాబుకు పేదలకు మంచి చేయాలనుకుంటే కొత్త భూములు కొని పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.. సచివాలయ ఉద్యోగులను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు..

READ MORE: Donald Trump: ట్రంప్ ప్రమాణస్వీకారం తర్వాత రోజే “ఇమ్మిగ్రేషన్‌” దాడి ప్రారంభం..