చంద్రబాబు గత పరిపాలనలో పేదలకు సెంటు భూమి ఇచ్చిన చరిత్ర లేదని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు.. గత వైసీపీ హయంలో 30.6 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారన్నారు.. జగన్ పేదల ఇళ్ల స్థలాల కోసం 15 వేల కోట్లతో భూములు కొనుగోలు చేశారన్నారు. దేశంలోని ఏ రాజకీయ పార్టీ కూడా పేదల స్థలాల కోసం ఇంత ఖర్చు చేయలేదన్నారు..
Off The Record: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు. సొంత పార్టీ నేతలతోనే ఎమ్మెల్యేకు పడటం లేదు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే నేనే రాజు.. నేనే మంత్రి అంటూ వ్యవహరిస్తున్నారనేది వైసీపీ ద్వితీయశ్రేణి నేతల ఆరోపణ. గుంటూరు జిల్లాకు చెందిన సుధాకర్‌బాబు గత ఎన్నికల సమయంలో సంతనూతలపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మొదట్లో అంతా బాగానే ఉన్నా తర్వాత సొంత పార్టీ నేతలతో గ్యాప్ వచ్చింది. తమకు ఓ మాట కూడా చెప్పకుండా ఎమ్మెల్యే ఇష్టారీతిన…