SS Rajamouli: రాజమౌళి దర్శకత్వం మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న అడ్వెంచర్స్ మూవీకి తాజాగా ‘వారణాసి’ సినిమా టైటిల్ ఖరారు చేశారు. ప్రఖ్యాత రామోజీ ఫిలిం సిటీ వేదికగా జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో వారణాసి సినిమా సంబంధించిన పోస్టర్ ను, ట్రైలర్ ను రాజమౌళి లాంచ్ చేశారు. ఇక ఇదే వేదికగా మహేష్ బాబు అభిమానులకు డైరెక్టర్ ఓ బిగ్ సప్రైజ్ ఇచ్చాడు. సినిమాలో మహేష్ బాబు రాముడు పాత్ర పోషిస్తున్నట్లు నేరుగా వెల్లడించాడు. రామాయణంలోని ఓ ముఖ్యమైన ఘట్టాన్ని తాను సినిమాగా తీయబోతున్నట్లు రాజమౌళి తెలిపారు.
Priyanaka Chopra: ఇక తగలబెడదామా.. మందాకిని దూకుడు మాములుగా లేదుగా..!
మహాభారతం తీయడం నా డ్రీం ప్రాజెక్టు అని.. అయితే, ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు రామాయణంలోని ఓ ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని తాను ఊహించలేదని తెలిపాడు. ఈ సినిమా సంబంధించి ఒక్కో డైలాగ్ రాస్తుంటే గాల్లో ఉన్న ఫీలింగ్ వచ్చిందని, మొదటిరోజు మహేష్ బాబుకు రాముడు వేషం తీసుకొని వచ్చి ఫోటోషూట్ చేసినప్పుడు తనకి గూస్ బంప్స్ వచ్చాయని తెలిపాడు. తను ఆ ఫోటోను వాల్ పేపర్ గా పెట్టుకున్నట్లు తెలిపాడు. కాకపోతే, అది కూడా ఎవరైనా చూస్తారేమో అని తీసేసానని చెప్పుకోవడం గమనార్హం.
ఇక నన్ను మహేష్ ను కలిపినందుకు నిర్మాత కెఎల్ నారాయణకు థాంక్స్ తెలిపారు. ఈ సినిమా కథను 15 ఏళ్ల క్రితమే మాట్లాడుకున్నామని.. కొన్ని కుదరకపోవడం వల్ల ఇలా డిలే అయిందని చెప్పుకొచ్చారు. ఇలాంటి సినిమా కథను మాటలో చెప్పలేమని, ఒక్క మాట చెప్పకుండా వీడియో చూస్తే సినిమాలోని కథ ఏంటో అర్థం అయ్యేలా చేయాలనుకున్నామని తెలిపాడు. కాకపోతే, వీడియో రాలేదని తెలుపుతూ హైదరాబాదులో గత నాలుగు నెలలుగా వర్షాలు పడుతున్నాయని చెప్పుకొచ్చాడు. మొత్తంగా నవంబర్ 15 వీడియో తీసుకోవచ్చామని రాజమౌళి పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో కూడా రాజమౌళి టైటిల్ చెప్పకుండా.. తనకి చిన్నప్పుడు ఎన్టీఆర్ సినిమాలే చూసేవాడినని.. కానీ, ఇండస్ట్రీకి వచ్చాక కృష్ణగారి గొప్పతనం అర్థమైందని తెలుపుతూ.. ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారని కొత్త టెక్నాలజీలో పరిచయం చేశారని చెప్పకచ్చారు. మేం కొత్త టెక్నాలజీ ‘ఫిల్మ్ ది ఫర్ ఐమాక్స్’ ఇంటర్డ్యూస్ చేస్తున్నట్లు తెలిపాడు. అలాగే ఆ టెక్నాలజీ ఎలా వీక్షకులకు కనపడుతుందో అని కూడా వివరంగా తెలియజేశారు. సినిమాని ఫుల్ స్క్రీన్ పై ఎలా చూడొచ్చని రాజమౌళి ప్రేక్షకులతో టెక్నాలజీ గురించి అర్థం అయ్యేలా వివరించాడు.
SS Rajamouli: టెస్టింగ్ కోసం ప్లే చేసిన వీడియో లీక్.. ఈవెంట్లో రాజమౌళి అసహనం
ఇక హీరో మహేష్ బాబు గురించి మాట్లాడుతూ.. సూపర్ స్టార్ అని చెప్పుకోవడమే కాదు గాని, మహేష్ బాబు సినిమా సెట్ కు వస్తే.. సెల్ ఫోన్ పట్టుకొని అది ఎన్ని గంటలైనా సరే షూటింగ్ అయ్యేంతవరకు కారులోనే పెట్టేసి షూటింగ్ చేస్తాడని తెలిపాడు. ఈ విషయాన్ని అందరూ నేర్చుకోవాలని, నేను కూడా అలాగే చేసేందుకు ట్రై చేస్తానని రాజమౌళి తెలిపాడు. ఇక ట్రైలర్ రిలీజ్ విషయంలో టెక్నికల్ ప్రాబ్లం రావడం పట్ల రాజమౌళి కాస్త ఎమోషనల్ అయ్యాడు. దేవుడు మీద నమ్మకం లేదు కానీ.. నాన్న హనుమ వెనకాల ఉంటాడు.. నడిపిస్తానని చెప్పారు.. ఇలా అంటే తను కోపం వచ్చిందని, ఇలాగేనా నడిపించేది అంటూ కాస్త అసహనం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత మా ఆవిడకు హనుమంతుడు అంటే.. చాలా ఇష్టమని ఆమె పైన కూడా కోపం వచ్చిందంటూ రాజమౌళి మాట్లాడారు.