SS Rajamouli: ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తెరకెక్కిస్తున్న దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి వారణాసి టైటిల్ ఈవెంట్ లో తన సినిమాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన సూపర్ స్టార్ కృష్ణను స్మరించుకున్నారు. దివంగత నటుడిని ప్రశంసించారు. ఇక, ఈ మూవీ గురించి వివరాలను వీడియో రూపంలో చెప్పబోతున్నామని తెలిపారు. కాగా, ఇప్పటికే ఈ వీడియోను విడుదల చేయాలని అనుకున్నప్పటికీ, సాధ్యపడలేదని వివరించారు. ఈ ప్రకటనతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.
Read Also: Aam Aadmi Bima Yojana: అద్భుతమైన స్కీమ్.. కేవలం రూ. 200కే రూ. 75,000 పొందే ఛాన్స్..
అయితే, ఈ చిత్రాన్ని ప్రీమియం లార్జ్ స్కేల్ ఫార్మాట్ (ఐమ్యాక్స్ కోసం)లో తెరకెక్కిస్తున్నామని దర్శకుడు రాజమౌళి ప్రకటించారు. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో, భారీ స్థాయిలో ఈ సినిమా రూపుదిద్దుకుంటున్నట్లు చెప్పారు. అదే సమయంలో, నిన్న రాత్రి సినిమాకు సంబంధించిన టెస్టింగ్ కోసం ప్లే చేసిన వీడియోను లీక్ చేశారంటూ డైరెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు సరికాదని, చిత్ర బృందం పడిన కష్టాన్ని గౌరవించాలని కోరారు. కాగా, సూపర్ స్టార్ మహేష్ బాబు- ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ సినిమా టైటిల్‌ను ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో రిలీజ్ చేశారు. ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. అలాగే, ఈ మూవీలో మహేష్ బాబు క్యారెక్టర్ పేరు రుద్రగా పరిచయం చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది.