ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ఇప్పటికే దేశం వదిలిపారిపోయిన గొటబాయ రాజపక్స తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మాల్దీవుల నుంచి ప్రత్యేక విమానంలో సింగపూర్ వెళ్లిన రాజపక్స తన రాజీనామా లేఖను పాక్స్ ద్వారా పార్లమెంట్ స్పీకర్ కార్యాలయానికి పంపించారు. తాజాగా ఈ రోజు స్పీకర్ మహిందా యాప అబేదర్థనే అధ్యక్షుడి రాజీనామాపై అధికార ప్రకటన చేయనున్నారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేసిన తర్వాత శ్రీలంక నిరసనకారుల్లో ఆనందం కనిపిస్తోంది.…