Bhadrachalam: నేడు భద్రాచలంలో శ్రీ సీతా రాముల కళ్యాణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీరామ నవమి సందర్బంగా నేడు (బుధవారం) భద్రాచల క్షేత్రం రామాలయంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరగబోతుంది. శ్రీ సీతారామల కళ్యాణం కోసం భద్రాద్రి అంగరంగ వైభవంగా ముస్తాబైంది. రామాలయంలో మూలవరులకు మొదట కళ్యాణం జరగనుంది. ఆలయం నుంచి మంగళ వాయిద్యాలతో మిథిలా కళ్యాణ మండపంకు ఉత్సవ మూర్తులను తీసుకెళ్లనున్నారు. ఇవాళ ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు కళ్యాణ క్రతువు కొనసాగనుంది. అభిజిత్ లగ్నంలో శ్రీ సీతారాముల కళ్యాణం జరగనుంది. లోక్‌సభ ఎన్నికల కోడ్ ఉండటంతో భద్రాచలంలో జరిగే శ్రీరాముడి కళ్యాణ మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి దూరంగా ఉన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమర్పించనున్నారు. 1800 మంది పోలీసులతో ఆలయ పరిసరాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Also: Jharkhand : జార్ఖండ్‌లో త్రిపుల్ మర్డర్.. భార్య, బిడ్డలను గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
ఇక, శీరామ నవమి సందర్భంగా ఈ మహాద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలానికి తరలి వచ్చే అవకాశం ఉంది. అలాగే, 31 వేల మంది భక్తులు కళ్యాణం వీక్షించేలా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లను చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. కళ్యాణ వేడుక జరిగే మిథిలా స్టేడియంలో శిల్పకళాశోభితమైన మండపాన్ని అద్భుతంగా అలంకరించారు. ఎండలు, ఉక్కబోతతో భక్తులు ఇబ్బందులు పడకుండా స్టేడియంలో 50 టన్నుల ఏసీతో పాటు, వంద కూలర్లు, 270 ఫ్యాన్లు ఏర్పాటు చేశారు.
ఇక, రాములోరి కళ్యాణానికి తరలివచ్చిన అశేష భక్త జనానికి ఇబ్బందులు లేకుండా ఆలయ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం ముత్యాల తలంబ్రాలు, లడ్డు ప్రసాదాలు పంపిణీ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. భక్తజనానికి ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2000 మంది పోలీస్ అధికారులు సిబ్బందితో పటిష్ట బందోబస్తు కొనసాగుతుంది. భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ శాఖ చేస్తుంది. పార్కింగ్ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా క్యూఆర్ కోడ్ తో భక్తులకు పోలీసులు దిశా నిర్దేశం చేస్తున్నారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!