Sreeleela: శ్రీలీల చిన్నపిల్లే అయినా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతుందని చెప్పవచ్చు. మిడియమ్ రేంజ్ హీరోల నుంచి బడా హీరోల వరకు ఇప్పుడు ప్రతి ఒక్కరి ఛాయిస్ ఈ ముద్దుగుమ్మే. దాదాపు ఇప్పుడు శ్రీలీల చేతిలో పది సినిమాలకు పైగా ఉన్నాయి. ఇక రెండు సంవత్సరాల వరకు ఆమె ఖాళీగా ఉండే అవకాశమే లేదు. శ్రీలీల 2019లో కిస్ సినిమాతో కన్నడ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సారి ఆమె చూడగానే తన క్యూట్ లుక్స్ తో అబ్బాయిలను కట్టిపడేసింది. తరువాత పెళ్లిసందD తో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ తో జత కట్టింది. ఈ జంట బాగుందని అప్పట్లో మంచి టాక్ వినిపించింది. ఆ సినిమాలో తన నటనతో పాటు డ్యాన్స్ తో కూడా ఆకట్టుకుంది శ్రీలీల. ఇక ధమాకా సినిమా ఈ ముద్దుగుమ్మ రేంజ్ ను ఎక్కడికో తీసుకువెళ్లిందని చెప్పవచ్చు. ఆ సినిమాలో ఆమె చేసిన డ్యాన్స్ లకు, ఆమె ఎనర్జీకి చాలా మంది ఫ్యా్న్స్ అయిపోయారు. ఇక అప్పటి నుంచి శ్రీలీల స్టార్ హీరోలకు కూడా ఫావరేట్ ఛాయిస్ అయిపోయింది. మహేష్ బాబు సరసన కూడా శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. అయితే ఈ సినిమాలో మొదట పూజాహెగ్డేను అనుకోగా కొన్ని కారణాల వల్ల పూజ తప్పుకోగా శ్రీలీల ఆ అవకాశాన్ని అందుకుంది.
Also Read: Varun Tej: పెళ్లి తరువాత బన్నీ, చరణ్ ఎలా మారిపోయారో చెప్పిన వరుణ్ తేజ్
ఇక పవన్ కల్యాణ్, బాలయ్యబాబు, నితిన్, రామ్ పోతినేని, వైష్ణవ్ తేజ్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ సినిమాలతో ప్రస్తుతం ఈ బ్యూటీ ఫుల్ బిజీగా ఉంది. అయితే ఇటువంటి సమయంలో శ్రీలీల ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సినిమాలకు కొద్ది రోజుల పాటు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. దీనికి ఓ పెద్ద కారణమే ఉంది. శ్రీలీల యమ్ బీబీఎస్ చదువుతున్న సంగతి తెలిసిందే. అయితే తనకి ఈ ఏడాదే చివరి సంవత్సరం అంటా, ఈ ఏడాదితో తన చదువు పూర్తి అవుతుందంటా. అందుకే పరీక్షలకు ప్రీపేర్ అయ్యేందుకు రెండు నెలలు సినిమాల నుంచి విరామం తీసుకోవాలనుకుంటుందంటా. ఈ సమయాన్ని చదువు కోసం వినియోగించుకోవాలనుకుంటుందంటా. దీని కోసం దర్శకనిర్మాతలను కూడా ఒప్పించిందంట. వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ముద్దుగుమ్మ రెండు నెలలు సినిమాలు బ్రేక్ ఇవ్వనుంది. నవంబర్ నుంచి జనవరి వరకు బ్రేక్ తీసుకునే అవకాశం ఉంది.