Pushpa 2 The Rule: ‘సార్’ ఏంటిది అసలు.. టీజర్ గురించి చెప్పడానికి పదాలు లేవు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sreeleela, Anasuya Bharadwaj on Pushpa 2 The Rule Teaser: సినీ ప్రియులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సినిమా ‘పుష్ప-ది రూల్’. 2021లో విడుదలైన ‘పుష్ప-ది రైజ్’ ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో పుష్ప 2 కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగష్టు 15న పుష్ప 2 రిలీజ్ కానుంది. అయితే నేడు ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం పుష్ప ది రూల్ టీజర్ విడుదల చేసింది. మాస్ అవతార్‌లో బన్నీ లుక్స్, యాక్షన్ సన్నివేశాలకు ఫాన్స్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం పుష్ప 2 టీజర్ ట్రెండింగ్‌లో ఉంది.
పుష్ప 2 టీజర్ చూసిన అభిమానులు గూస్బంప్స్ వచ్చాయని ట్వీట్స్ చేస్తున్నారు. ఫాన్స్ మాత్రమే కాదు హీరోయిన్స్ కూడా టీజర్ గురించి పోస్టులు పెడుతున్నారు. స్టార్ హీరోయిన్ శ్రీలీల పుష్ప 2 టీజర్‌పై స్పందించారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు అల్లు అర్జున్ సార్. పుష్ప 2 టీజర్ అద్భుతంగా ఉంది. చెప్పడానికి పదాలు లేవు. సినిమా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా’ అని శ్రీలీల ట్వీట్ చేశారు. అల్లు అర్జున్, శ్రీలీల `ఆహా ఒరిజినల్` యాడ్ కోసం జతకట్టిన విషయం తెలిసిందే.
Also Read
Also Read: Allu Arjun Birthday: హ్యాపీ బర్త్‌డే బావ.. అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు తెలిపిన స్టార్ హీరో!
పుష్ప 2 టీజర్‌పై నటి అనసూయ భరద్వాజ్ కూడా స్పందించారు. ‘సార్.. ఏంటిది?. ఆహా ఏంటిది అంట?. అలా కాలు తిప్పి.. టైమింగ్‌లో కొంగు పట్టి దూపి.. విడిలించి.. నడుస్తుంటే సార్’ అని అనసూయ ట్వీట్ చేశారు. అలానే పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలిపారు. పుష్ప ది రైజ్‌లో కీలక పాత్ర చేసిన అనసూయ పుష్ప ది రూల్‌లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌పై పార్ట్ 2లో అను పగ తీర్చుకునే సన్నివేశాలు ఉండనున్నాయి.
Saaaaaaarrrrr!! Yentidi??!!!!! Aha yentidi anta??!!!! Ala kaalu tippi timing lo kongu patti doopi.. vidilinchi.. nadustunte saaaarr!!!!🤯🤯🤯🤯🔥🔥🔥🔥🔥🔥#HappyBirthdayAlluArjun #HappyBirthdayIconStar https://t.co/DxKzMj8aJX https://t.co/OPTuRnulSs
— Anasuya Bharadwaj (@anusuyakhasba) April 8, 2024
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!