Sree Vishnu- Hasith Goli Swag Worldwide Grand Release On October 4th : కింగ్ అఫ్ కంటెంట్ అంటూ స్వాగ్ టీం బిరుదునిచ్చిన శ్రీవిష్ణు వైవిధ్యమైన పాత్రలతో అదరగొడుతున్నారు. ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకునే సబ్జెక్ట్‌లను బ్యాలెన్స్ చేయడంలో పేరుపొందిన శ్రీ విష్ణు సూపర్ హిట్ ‘రాజ రాజ చోర’ తర్వాత డైరెక్టర్ హసిత్ గోలీతో తన సెకెండ్ కొలాబరేషన్ గా ‘శ్వాగ్’ తో అలరించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ అప్‌డేట్ ఇచ్చేసారు. దసరాకి దాదాపు 10 రోజుల ముందుగా అక్టోబర్ 4న ‘శ్వాగ్’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. పండుగ సెలవులు సినిమాకు ఫేవర్ గా ఉండబోతున్నాయని మేకర్స్ భావిస్తున్నారు.
Telugu Heroines: కోట్లకు కోట్లు రెమ్యునరేషన్లు.. అండగా నిలిచేందుకు మనసు రాదా?
ఇక సినిమా విడుదలకు దాదాపు నెల రోజుల సమయం ఉండడంతో రెగ్యులర్ అప్‌డేట్‌లతో రావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘శ్వాగ్’ ఇప్పటికే పాజిటివ్ రిపోర్ట్స్ తో దూసుకుపోతోంది. పోస్టర్లు, ఫస్ట్ సాంగ్ , రేజర్ వీడియో, టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. యూనిక్ కంటెంట్ ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ చిత్రంలో రీతూ వర్మ హీరో నటిస్తుండగా, మీరా జాస్మిన్, సునీల్, దక్షనాగార్కర్, శరణ్య ప్రదీప్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వేదరామన్ శంకరన్ సినిమాటోగ్రాఫర్ కాగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. జిఎం శేఖర్ ఆర్ట్ డైరెక్టర్ కాగ, నందు మాస్టర్ స్టంట్స్ నిర్వహిస్తున్నారు. ఇక శ్రీవిష్ణు, రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ ఈ సినిమాలో నటీనటులు.