Sree Vishnu: ఎవరొచ్చినా సరే ఎంటర్టైన్ చేసి పంపిస్తా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sree Vishnu: ‘విష్ణు విన్యాసం’ సినిమా విడుదల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో హీరో శ్రీ విష్ణు సినిమా సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. ముందుగా మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. ఈ సినిమా ప్రారంభానికి కారణమైన చారి, అలాగే దర్శకుడు మారుతికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కథ విన్న వెంటనే నచ్చిందని, తరువాత నిర్మాతలు సుమంత్ , సుబ్రహ్మణ్యంలు ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లడంతో టీమ్ గా చాలా సంతోషంగా పనిచేశామని అన్నారు.
Vaishnavi Chaitanya: జి.వి. ప్రకాష్ కుమార్‌తో వైష్ణవి చైతన్య రొమాన్స్?
Also Read
- Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. 'బాండెడ్ క్రైట్'గా గుర్తించిన అటవీ అధికారులు!
- PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్‌కు మోడీ సందేశం
- HCU Drugs: హెచ్‌సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
- Hardik Pandya: "కెప్టెన్సీ ఇస్తేనే వస్తా".. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
సినిమా టెక్నికల్ టీమ్‌ను కూడా శ్రీ విష్ణు ప్రశంసించారు. సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్, ఎడిటర్ కార్తిక్, సంగీత దర్శకుడు రథన్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఎడిటర్ కార్తిక్ గురించి మాట్లాడుతూ.. చిన్న క్యారెక్టర్‌తో ప్రారంభించి ఈ సినిమాతో ఎడిటర్‌గా డెబ్యూ చేస్తున్నాడని, భవిష్యత్తులో మంచి ఎడిటర్‌గా ఎదుగుతాడని నమ్మకం వ్యక్తం చేశారు. ఆర్ట్ డైరెక్టర్ రామాంజనేయులుతో ఇది రెండో సినిమా అని, మొదటి చిత్రం ‘బ్రోచేదెవరురా’ సూపర్ హిట్ అయిందని గుర్తుచేశారు.
హీరోయిన్ నైనా సారిక ఈ సినిమాలో చాలా మంచి పాత్రలో కనిపించనుందని, ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు. స్ట్రాంగ్ క్యారెక్టర్ల కోసం దర్శకులు ఈ సినిమా చూసిన తర్వాత ఆమెను సంప్రదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుడు మారుతి గురించి మాట్లాడుతూ.. సినిమానే అతని ప్రపంచమని అన్నారు. ‘విష్ణు విన్యాసం’ కథ విషయానికి వస్తే.. ఒక చిన్న పట్టణ నేపథ్యంలో సాగే సింపుల్ స్టోరీ అని శ్రీ విష్ణు తెలిపారు. ఫస్ట్ హాఫ్ యువతను బాగా ఆకట్టుకునేలా హాస్యంతో నిండుగా ఉంటుందని, సెకండ్ హాఫ్ పూర్తిగా ఫ్యామిలీ డ్రామాగా మారుతుందని చెప్పారు. మొత్తం రెండు గంటల పాటు ప్రేక్షకులను నవ్విస్తూ, ఎమోషనల్‌గా కూడా కనెక్ట్ అయ్యేలా సినిమా రూపొందించామని తెలిపారు.
T20 World Cup 2026: గుడ్‌న్యూస్.. రింకు సింగ్ ఈజ్ బ్యాక్.. !
మొత్తంగా సినిమాకు ఎవరొచ్చినా సరే ఎంటర్టైన్ చేసి పంపిస్తా అని ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 27న విడుదల కానున్న ‘విష్ణు విన్యాసం’ సినిమా ప్రతి ఒక్కరినీ ఎంటర్టైన్ చేస్తుందని శ్రీ విష్ణు ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. ‘బాండెడ్ క్రైట్’గా గుర్తించిన అటవీ అధికారులు!
-
PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్‌కు మోడీ సందేశం
-
Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
-
HCU Drugs: హెచ్‌సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
-
Hardik Pandya: “కెప్టెన్సీ ఇస్తేనే వస్తా”.. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
ట్రెండింగ్
-
4K 180Hz డిస్‌ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్‌ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్‌ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!