Sports Authority Of India: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI)లో జూనియర్ ఇంజనీర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందు కోసం ఆసక్తిగల అభ్యర్థులు 31 జనవరి 2025 లోపు అప్లై చేసుకోవచ్చు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా sportsauthorityofindia.nic.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారికంగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఎంపికైన అభ్యర్థికి 7వ పే కమిషన్ ప్రకారం నెలకు రూ.35,400 నుండి రూ.1,12,400 వరకు జీతం ఇవ్వబడుతుంది. జూనియర్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి సివిల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా డిగ్రీని కలిగి ఉండాలి. దీనితో పాటు అభ్యర్థికి సంబంధిత రంగంలో కనీసం 1 సంవత్సరం పని అనుభవం కూడా ఉండాలి.
Also Read: Manchu Vishnu: టాలీవుడ్‌లో నెపోటిజంపై షాకింగ్ కామెంట్స్ చేసిన మంచు విష్ణు..
జేఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. కాంపిటెంట్ అథారిటీ తయారుచేసిన మెరిట్ జాబితా ప్రకారం అభ్యర్థులు ఎంపిక చేయబడతారు. ఇంటర్వ్యూలో విజయం సాధించిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. అయితే, ఇందులో కేవలం 3 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరడం జరిగింది.
Also Read: CDSCO: మరోమారు నాణ్యత పరీక్షలలో విఫలమైన 135 రకాల మందులు..
SAI JE రిక్రూట్‌మెంట్ 2025 ఎంపిక ప్రక్రియ కోసం మొదట sportsauthorityofindia.nic.in అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్ళాలి. అక్కడ హోమ్ పేజీలో ఇచ్చిన జాబ్స్ విభాగానికి వెళ్లండి. ఇక్కడ జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్‌పై క్లిక్ చేసి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయండి. నోటిఫికేషన్‌లో పేర్కొన్న చిరునామాకు సూచించిన విధంగా దరఖాస్తును సరైన అడ్రస్ కు పంపాలి.