Abhishek Sharma: భారత్ – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్ బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 153 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ మొదటి బంతికే సంజూశాంసన్ వికెట్ కోల్పోయింది. కానీ టీమ్ ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన దూకుడైన బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచంలో మరో సంచలన ఇన్నింగ్స్ నమోదు చేశాడు.
READ ALSO: కృతి శెట్టి బ్యూటీ బ్లాస్ట్.. క్లోజప్ షాట్స్‌లో ఫైర్.!
అభిషేక్ శర్మ కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, భారత క్రికెట్ చరిత్రలో రెండో వేగవంతమైన అర్ధశతకం సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అత్యంత వేగవంతమైన అర్ధశతకం సాధించిన ఆటగాడిగా అతడికంటే ముందున్న ఏకైక ఆటగాడు యువరాజ్ సింగ్ మాత్రమే. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై యువీ కేవలం 12 బంతుల్లో ఆరు సిక్సర్లతో ఫిఫ్టీ బాదిన విషయం అందరికీ తెలిసిందే. నిజానికి అభిషేక్ శర్మకు యూవీ మెంటార్‌గా ఉన్నాడు. తాజాగా ఈ మ్యాచ్‌లో చెలరేగి ఆడిన అభిషేక్ శర్మ.. యూవీ తర్వాత స్థానంలో నిలిచి గురువుకు తగ్గ శిష్యుడిగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ తన ట్రేడ్‌మార్క్ అగ్రెసివ్ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. యువరాజ్ సింగ్ తర్వాత రెండో వేగవంతమైన ఫిఫ్టీ సాధించడం అంటే సాధారణ విషయం కాదు. ఈ ఇన్నింగ్స్‌తో అభిషేక్ శర్మ భారత టీ20 జట్టులో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
READ ALSO: Hardik Pandya: ఏం క్యాచ్ మామా.. కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన హార్దిక్ పాండ్య వీడియో!