నయనతార పేరుకు పరిచయాలు అవసరం లేదు.. లేడి బాస్ గా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది.. ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అయిన ఇప్పటివరకు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న నయన తార రీసెంట్ గా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది.. తన కొత్త ఇంస్టాగ్రామ్ అకౌంట్ కు ఫాలోవర్స్ పెరుగుతున్నారు.. తాజాగా తన భర్తతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ ఫోటోలలో ఆమె పెట్టుకున్న వాచ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది..
రీసెంట్ గా జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తన భర్త మరియు పిల్లలతో కలిసి లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది. ఇక ఇటీవల కుటుంబంతో కలిసి వెకేషన్ వెళ్లిన సంగతి తెలిసిందే.. అప్పుడు పిల్లలతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. తాజాగా తన భర్తతో కలిసి ఓ పార్టీకి వెళ్లింది.. అక్కడ దిగిన ఫొటోలే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి..
ఇక ఆ ఫోటోలలో ఆమె ధరించిన వాచ్ అందరి దృష్టిని మళ్లించింది. ఆమె చీరకు సరిగ్గా సరిపోయే విలాసవంతమైన రోలెక్స్ ఓస్టెర్ పర్పెచ్యువల్ 36 ధరించింది.. ఆ వాచ్ ధర గురించి ఆమె ఫ్యాన్స్ గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు.. నిజానికి ఈ వాచ్ ఖరీదు దాదాపు 5.5 లక్షలు. ఇక ఈ పిక్స్ లో నయన్ ధరించిన వాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. నయన్ దగ్గర ఇప్పటికే చాలా ఖరీదైన వాచ్ లు ఉన్నాయి.. ఇక ప్రస్తుతం ఈమె తమిళ సినిమాలను మాత్రమే చేస్తుంది..