తెలంగాణ రాష్ట్రం గ్రీన్ పవర్ రంగంలో అద్భుత విజయాలను సాధించి, దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాంకేతికత, ఫార్మాస్యూటికల్స్, ఉత్పత్తి, వ్యవసాయా రంగాల అభివృద్ధికి కేంద్రంగా ఉద్భవించిందని తెలిపారు.
ఈనెల 30న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరుగనుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కి సభ సంతాపం తెలపనుంది. ఈ క్రమంలో సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. సంతాప దినాల్లో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు శాసన సభ నివాళులు అర్పించనుంది.
బ్యాంకర్లు హైడ్రా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. హైడ్రా భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. బుధవారం ప్రజా భవన్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ, టౌన్ ప్లానింగ్ వంటి ప్రభుత్వ విభాగాలు అన్ని అంశాలు పరిశీలించి నిర్మాణాలకు అనుమతులు ఇస్తాయని, ఏ ప్రభుత్వమైనా వీటిని కొనసాగిస్తాయని వివరించారు.